విజయనగరంలో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
విజయనగరం : నకిలీ నోట్లను చలామణీ చేస్తున్న ముఠా గుట్టును విజయనగరం పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ నవదీప్సింగ్ రావల్ తెలిపిన వివరాల మేరకు... గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన నాగేశ్వరరావు, తెనాలికి చెందిన పరమేశ్వరరావు, రాజేష్తోపాటు విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన భూపతిరాజా గత కొన్ని రోజులుగా నకిలీ కరెన్సీని చలామణి చేసేందుకు విజయనగరంలో తిరుగుతున్నారు.
ఆ క్రమంలో నకిలీ రూ.1000 నోట్లకు అసలు రూ. 500 నోట్ల తీసుకుని మారుస్తున్నారు. దీనిపై జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పోలీసులు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు మాటు వేసి.... నకిలీ నోట్ల ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. రూ. 6.35 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.