vizianagaram police
-
మహిళతో వివాహేతర సంబంధం; ఆమె కూతురిని పెళ్లి చేసుకోవాలని..
విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్లో మూడు నెలల కిందట నమోదైన అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. సారిక గ్రామానికి చెందిన బొద్దూరు పవన్‌కుమార్ (17) అదృశ్యం కేసులో సంచలన విషయాలు తేలాయి. అతడు హత్యకు గురయ్యాడని తేలింది. ఈ హత్యలో పాల్గొన్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కేసు వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో పట్టణ డీఎస్పీ అనిల్‌కుమార్ తెలిపారు. తన కుమారుడు పవన్‌కుమార్ మే 8వ తేదీన సాయంత్రం పాలప్యాకెట్లు తెచ్చేందుకు ఇంటి నుంచి బైక్‌పై వెళ్లి తిరిగి రాలేదని మే 9న తల్లి లత పోలీసులకు ఫిర్యాదుచేసింది. అదృశ్యం కేసుగా నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే జూలై 27వ తేదీన సారిక గ్రామానికి దగ్గరలో ఉన్న వ్యవసాయ బావిలో ఓ మృతదేహాన్ని గుర్తించగా అది పవన్దిగా నిర్ధారించి దర్యాప్తు చేయగా పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా స్కెచ్‌తో... పవన్‌కుమార్ తండ్రి చనిపోయాడు. ఈ క్రమంలో తల్లి లతకు పద్మనాభ మండలం చిన్నాపురానికి చెందిన గిడిజాల జగదీశ్‌తో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై పవన్ పలుమార్లు తల్లిని మందలించాడు. జగదీశ్‌ను సైతం హెచ్చరించినా వినకుండా వారి బంధం కొనసాగుతోంది. ఇదిలాఉండగా.. సారిక గ్రామానికి చెందిన వాలిపల్లి సురేశ్ (33)తో పవన్‌కు మంచి స్నేహం ఉంది. సురేశ్ కన్ను పవన్ చెల్లిపై పడింది. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. దీనికి పవన్‌తో పాటు తల్లి నిరాకరించారు. పాఠశాలకు వెళ్తున్న చిన్నపిల్ల కావాల్సి వచ్చిందా అంటూ మందలించారు. ఆ అమ్మాయి మీద ప్రేమతో సురేశ్ లతతో వివాహేతర సంబంధం ఉన్న జగదీశ్‌ను సంప్రదించాడు. ఇద్దరూ ఏకమై పవన్‌ను చంపితే తమ లక్ష్యాలు నెరవేరుతాయని భావించారు. పవన్ హత్యకు తనవద్ద పనిచేస్తున్న సువ్వాడ శంకరరావును సురేశ్ సాయం కోరాడు. ట్రాక్టర్ డ్రైవర్ పిట్టా శంకర్, మరో స్నేహితుడు మేకల సోముల సాయంతో హత్యకు పథకం సిద్ధం చేశాడు. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ అనిల్‌కుమార్, సీఐ మంగవేణి, ఎస్ఐలు నారాయణరావు, అశోక్‌కుమార్, కిరణ్ కుమార్‌నాయుడు, ప్రశాంత్ కుమార్ అయితే మే 8వ తేదీన పవన్‌కు డబ్బులు అవసరమై సురేశ్‌ను రూ.2 వేలు అప్పు అడిగాడు. సురేశ్ రూ.వెయ్యి ఇచ్చి మిగతా వెయ్యి సాయంత్రం ఇస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని శంకర్‌కి సురేశ్ చెప్పగా ఇదే అదును అని సారిక గ్రామ సమీపంలో కల్లు తాగే ప్రదేశం వద్ద మేకల సోములు, పిట్టా శంకర్లను తాళ్లు, ప్లాస్టిక్ గోనె సంచెతో పవన్‌ను హతమార్చేందుకు సిద్ధంగా ఉంచారు. సాయంత్రం కావడంతో రూ.వెయ్యి కోసం పవన్ ఫోన్ చేయగా సురేశ్ సువ్వాడ శంకర్‌తో కలిసి ముగ్గురూ ఒకే వాహనంపై కల్లుతాగే ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే కాపు కాస్తున్న సువ్వాడ శంకర్ బైక్ దిగుతుండగానే కర్రతో పవన్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో పవన్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని కనిపించకుండా సోములు, పిట్టా శంకర్ గోనె సంచిలో మూట కట్టి సమీపంలోని వ్యవసాయ బావిలో వేశారు. బైక్‌ను కూడా తాళ్లతో బావిలో పడేశారు. అయితే పవన్ ఇంటికి రాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే కొన్ని క్లూలతో హంతకులు వాలిపల్లి సురేశ్, సువ్వాడ శంకరరావు, మేకల సోములు, పిట్టాశంకర్, గిడిజాల జగదీశ్ చిక్కారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. కేసు ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన రూరల్ సీఐ మంగవేణి, ఎస్ఐలు నారాయణరావు, అశోక్‌కుమార్, గంట్యాడ ఎస్ఐ కిరణ్ కుమార్‌నాయుడు, సీసీఎస్ ఎస్ఐ ప్రశాంత్ కుమార్, ఏఎస్ఐ త్రినాథరావు, హెచ్‌సీలు శ్యామ్‌బాబు, రామారావు, సిబ్బంది షేక్ షఫీ, కోటేశ్వరరావు, రమణ, సాయిలను డీఎస్పీ అభినందించారు. వారికి నగదు పోత్సాహక బహుమతులను అందజేశారు. -
మహిమ గల మరచెంబు అంటూ...
బొబ్బిలి : మహిమ గల మరచెంబును విక్రయిస్తున్నామని చెప్పి ఓ రియల్ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ. కోటి 13లక్షలు కాజేసిన ముఠా గుట్టును విజయనగరం జిల్లా రామభద్రపురం పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి రూ.లక్ష నగదు, మహిమ ఉందని చెబుతున్న మర చెంబును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎస్సై డి.డి.నాయుడు మంగళవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వల్లేపు శేషగిరికి హైదరాబాద్‌కు చెందిన మోహన్, విజయవాడకు చెందిన వెంకట్ ఇటీవలే స్నేహితులయ్యారు. వారి మధ్య అన్యోన్యత పెరిగిన తరువాత విజయనగరం జిల్లా రామభద్రపురం ప్రాంతానికి చెందిన కొందరివద్ద మహిమగల మరచెంబు ఉందనీ, దానిని కొనుగోలు చేస్తే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తుందని శేషగిరిని మోహన్ నమ్మించాడు. ఆయనను రామభద్రపురానికి తీసుకువచ్చి అక్కడకు చెంబు ఉందని చెప్పిన చింతాడ తేజ్ మోహన్‌రావు (హైదరాబాద్), శ్రీపతి కౌసల్య(పార్వతీపురం), చింతాడ ప్రియదాసు(నర్సిపురం), బొబ్బిలికి చెందిన ఏగిరెడ్డి చిట్టి నాయుడు, కోరాడ సీతారాంలతో పాటు గలావిల్లి రవి (కొమరాడ మండలం దళాయి పేట)ని రప్పించారు. వీరంతా కలసి రామభద్రపురంలో గత అక్టోబర్‌లో చెంబును రూ.ఒక కోటి 13 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా శేషగిరి అడ్వాన్సుగా రూ.13 లక్షలు వారికి ఇచ్చాడు. కొద్దిరోజుల తరువాత రామభద్రపురం బైపాస్ సెంటర్లోని సత్యసాయి ఆలయం వద్ద రెండో విడతగా రూ.కోటి ఇచ్చాడు. రెండో విడతలో మర చెంబును చూపించి దానిని విజయనగరంలో ఇస్తామని చెప్పి శేషగిరిని కారు ఎక్కించుకున్నారు. అందరూ కారులో వెళ్తుండగా ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఇక్కడ పోలీసుల చెకింగ్ ఉందని చెప్పి శేషగిరిని నమ్మించారు. తాము చెంబుతో పాటు వెనుకే వస్తామని ఆయన్ను కారులో వెళ్లిపోవాలని సూచించారు. విజయనగరంలో చెంబు అందజేస్తామని చెప్పగా శేషగిరి విజయనగరంలో చెంబుకోసం వేచి చూడసాగాడు. వారు తిరిగి రాకపోగా.. ఫోన్ చేస్తే ఇదిగో అదిగో అంటూ ఇంతవరకూ కాలయాపన చేశారు. ఇక చేసేది లేక ఈ నెల 1న రామభద్రపురం ఎస్ఐ డి.డి.నాయుడుకు శేషగిరి ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన ఎస్ఐ అందరి ఆచూకీ తెలుసుకుని మోహన్‌తో పాటు అనుచరులు ఐదుగుర్ని సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి లక్ష రూపాయల నగదు, మరచెంబు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులను విచారించిన పోలీసులకు నిందితులు తమకు రూ.30లక్షలు మాత్రమే ఇచ్చాడనీ, మిగతా సొమ్ము ఇవ్వలేదనీ చెప్పడం విశేషం. మర చెంబు కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితులు గతంలో మహిమ గల నాణేలను విక్రయించేవారని కూడా గుర్తించారు. గతంలో బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం, రాయఘడ ప్రాంతాల్లో వీరు మహిమలున్న నాణేలంటూ పలువురి వద్ద నగదు కాజేసి ఉడాయించిన కేసులున్నాయని ఎస్ఐ డీడీ నాయుడు తెలిపారు. -
విజయనగరంలో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్
విజయనగరం : నకిలీ నోట్లను చలామణీ చేస్తున్న ముఠా గుట్టును విజయనగరం పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ రావల్ తెలిపిన వివరాల మేరకు... గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన నాగేశ్వరరావు, తెనాలికి చెందిన పరమేశ్వరరావు, రాజేష్‌తోపాటు విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన భూపతిరాజా గత కొన్ని రోజులుగా నకిలీ కరెన్సీని చలామణి చేసేందుకు విజయనగరంలో తిరుగుతున్నారు. ఆ క్రమంలో నకిలీ రూ.1000 నోట్లకు అసలు రూ. 500 నోట్ల తీసుకుని మారుస్తున్నారు. దీనిపై జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పోలీసులు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు మాటు వేసి.... నకిలీ నోట్ల ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. రూ. 6.35 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. -
జాతరలో పోలీసులు ప్రతాపం: వ్యక్తి మృతి
-
జాతరలో పోలీసులు ప్రతాపం: వ్యక్తి మృతి
విజయనగరం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొప్పెర జాతరలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. జాతరకు వచ్చిన ఓ వ్యక్తిపై పోలీసులు చితకబాదారు. దీంతో అతడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో మృతుడి బంధువులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని మృతదేహంలో ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.