కర్నూలు: కర్నూలు నగరంలో అక్రమంగా తరలిస్తున్న 16 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నోవా కారును సీజ్ చేశారు. ముంగళవారం కర్నూలులో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఇన్నోవా కారులో భారీగా బంగారం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు.
బంగారం గురించి వాహనదారులను ప్రశ్నించగా... వారు పొంతనలేని సమాధానాలు తెలిపారు. దీంతో పోలీసులు బంగారాన్ని సీజ్ చేసి ... వారిని స్టేషన్కు తరలించారు. బంగారంపై పోలీసులు వారిని విచారిస్తున్నారు. బెంగళూరు నుంచి వారంత కర్నూలు వస్తున్నారని పోలీసులు తెలిపారు.