నన్ను ఎన్నుకోకపోతే మీ తలలు నరుక్కున్నట్లే: టీజీ
కర్నూలు: ‘నన్ను ఎన్నుకోకపోతే మీ తలలు నరుక్కున్నట్లే’ అని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ అన్నారు. ఆదివారం ఆయన కర్నూలు నగరంలో రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో మంచివాళ్లను ఎన్నుకోవాలని.. తాను నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని.. అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
ఓట్ల కోసం వచ్చే వారు ఏ సేవ చేశారో తెలుసుకోవాలన్నారు. కళ్లు లేని వాళ్లకు తాను చేసిన అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. రాజకీయాలను మార్చే శక్తి మీడియాకు లేదన్నారు. ఆ శక్తి ఉంటే తాను ఏనాడో పేపర్, టీవీ చానల్ పెట్టేవాడినని మంత్రి చెప్పారు.