అయ్యప్ప మాలతో వచ్చాడని చితక్కొట్టేసింది | Student Beaten By Teacher in JMJ School in Kurnool city | Sakshi
Sakshi News home page

అయ్యప్ప మాలతో వచ్చాడని చితక్కొట్టేసింది

Published Sat, Nov 1 2014 10:37 AM | Last Updated on Fri, Nov 9 2018 4:19 PM

అయ్యప్ప మాలతో వచ్చాడని చితక్కొట్టేసింది - Sakshi

అయ్యప్ప మాలతో వచ్చాడని చితక్కొట్టేసింది

కర్నూలు: కర్నూలు నగరంలోని జేఎంజే స్కూల్లో శనివారం దారుణం చోటు చేసుకుంది. అయ్యప్ప మాలతో స్కూల్కి వచ్చిన ఓ విద్యార్థినిపై టీచర్ తన ఆగ్రహన్ని ప్రదర్శించింది. ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకుని రావాలంటూ హుకుం జారీ చేశారు. అందుకు విద్యార్థి ససేమిరా అనటంతో టీచర్ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో బెత్తం తీసుకుని విద్యార్థిని చితక బాదింది. విద్యార్థి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపారు.

దాంతో తల్లిదండ్రులు, వీహెచ్పీ నేతలతోపాటు కార్యకర్తలు స్కూల్ కు చేరుకుని... క్షమాపణలు చెప్పాలంటూ స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్  చేశారు. అందుకు వారు అంగీకరించకపోవడంతో తరగతి గదులలోకి ప్రవేశించి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అనంతరం స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో జేఎంజే స్కూల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement