వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనే భయం టీడీపీకి పట్టుకుందని బీజేపీ ఎమ్మెల్యే విష్టు కుమార్ రాజు అన్నారు. పుట్టిన రోజు నాడైనా చంద్రబాబు నిజాలు మాట్లాడితే బాగుంటుందని ఆయన హితవు పలికారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు ప్యాకేజీకి ఒప్పుకుంది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే అని ఎమ్మెల్యే మండిపడ్డారు. కొందరి డైరెక్షన్‌లో బాబు నడుస్తున్నారు.. టీడీపీ కేవలం ఫ్యామిలీ పార్టీ మాత్రమే అని బీజేపీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.