రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
Published Wed, Feb 24 2016 10:49 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
పాణ్యం: కర్నూలు జిల్లా పాణ్యం మండలం ఆర్‌జీఎం కళాశాల వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి, యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయిల్ ట్యాంకర్ వచ్చి బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్ పై కళాశాలకు వెళుతున్న నాగస్వర్ణ అనే యువతి, మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆమెను స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కర్నూలుకు తరలించారు.
Advertisement
Advertisement