సాక్షి, కర్నూలు: లాక్‌డౌన్ నిబంధనలు పాటించనివారిని చితకబాదిన పోలీసులను చూశాం.. వాహనాలను సీజ్ చేసిన రక్షకభటులను చూశాం.. బయటకు రావొద్దని, కరోనా బారిన పడొద్దని బతిమాలిన మనసున్న ఖాకీలను చూశాం.. ఈక్రమంలోనే కర్నూలు జిల్లా పాణ్యం పోలీసులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. షార్ట్ ఫిల్మ్ ద్వారా యువతకు సందేశం ఇచ్చారు. ‘చిన్న చిన్న కారణాలతో బయటకు వస్తున్నారు. మాటలతో చెప్పాం.. చేతలతో చెప్పాం. ఎంతచెప్పినా మీరు మారరా..! ఎలా చెప్తే మారుతారు. మీ కాళ్లు మొక్కి చెప్పడానికైనా సిద్ధం. దయచేసి బయటకు రావ్దొదు’అని షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ప్రధానంగా యువకులు లాక్‌డౌన్ ఉల్లంఘించి బయటకు వస్తున్నారని, వారికి పరిస్థితి అర్థమయ్యేలా చెప్పేందుకే ఈ ప్రయత్నమని పోలీసులు వెల్లడించారు. పాణ్యం పోలీసుల ప్రయత్నానికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
(చదవండి: ఒక్కసారి కూడా దగ్గు రాకపోతే?)
(చదవండి: కోవిడ్‌పై డ్రోన్‌తో యుద్ధం)
Comments
Please login to add a commentAdd a comment