సాక్షి, కర్నూలు: పాణ్యం కేశవరెడ్డి స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న సుష్మా అనే విద్యార్ధిని మంగళవారం తెల్లవారుజామున హాస్టల్ భవనం పై నుంచి పడి మృతి చెందారు. హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి సుష్మా పడిపోవడంతో.. స్కూల్ యాజమాన్యం ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించింది. అయితే ఆస్పత్రికి తరలించేలోపే విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పాణ్యం పోలీసులు స్కూల్ వద్దకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థిని హాస్టల్ పై నుంచి దూకి కింద పడ్డారా లేదా అనే దానిపై విచారణ చేపట్టారు.
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందటంపై.. బాధితురాలి బంధువులు, విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థినిని యాజమాన్యమే హత్య చేసి మేడపై నుంచి తోసేసి ఉంటారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థిని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తెలితే.. స్కూల్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment