రెండేళ్ల పిల్లాడిని చంపేసిన పులి | 2-yr old boy killed by a tiger at Motichur area, villagers block national highway | Sakshi
Sakshi News home page

రెండేళ్ల పిల్లాడిని చంపేసిన పులి

Published Fri, Feb 26 2016 10:57 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

రెండేళ్ల పిల్లాడిని చంపేసిన పులి - Sakshi

రెండేళ్ల పిల్లాడిని చంపేసిన పులి

హరిద్వార్ : ఉత్తరాఖండ్‌లోని  రాజాజీ  నేషనల్ పార్క్ ఏరియాలో మరోసారి కలకలం రేగింది. ఏనుగులు, పులులకు ప్రసిద్ధి గాంచిన ఈ పార్క్ లోంచి బయటికి వచ్చిన పులి  ఓ చిన్నారిని పొట్టనపెట్టుకుని బీభత్సం సృష్టించింది. హరిద్వార్‌లోని మోతిచూర్ అనే ప్రాంతంలోకి చొరబడిన ఓ పులి.. రెండేళ్ల పిల్లవాడిని చంపేసింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో కలకలం రేగింది. స్థానికులు భయంతో పరుగులు పెట్టారు.  ఘటనా స్థలానికి చేరుకున్న  అటవీ అధికారులు,  పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగారు. పార్కులో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేయాలంటూ ఆందోళనకు  దిగారు. పార్క్ చుట్టూ గోడ ఎత్తు పెంచాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో ట్రాఫిక్ కు భారీగా అంతరాయం కలిగింది. కాగా గత ఏడాది ఈ పార్క్ లోంచి ఐదు ఏనుగులు జనావాసంలోకి  చొచ్చుకొని  వచ్చి గలాటా సృష్టించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement