గుజరాత్‌లో భరూచ్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ధాటికి ఆరుగురు పనివాళ్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
అహ్మదాబాద్‌కు 235 కిలోమీటర్ల దూరంలోని దహేజ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన అర్ధరాత్రి 3గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్ దగ్గర పని చేస్తుండగా పేలుడు సంభవించి వాళ్లంతా మృత్యువాత పడ్డట్లు భరూచ్ ఎస్పీ లీనా పాటిల్ తెలిపారు. ప్రమాదంలో ఇంకెవరూ గాయపడలేదని వెల్లడించారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి 2 లక్షల రూపాయల సాయం బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లు ట్వీట్ చేసింది ప్రధాని కార్యాలయం. అలాగే ఎవరైనా గాయపడితే రూ. 50 వేలు అందించనున్నట్లు తెలిపింది.
PM @narendramodi has expressed grief on the loss of lives due to a mishap at a factory in Bharuch. He extends condolences to the bereaved families.
— PMO India (@PMOIndia) April 11, 2022
An ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of the deceased. The injured would be given Rs. 50,000.
Comments
Please login to add a commentAdd a comment