కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు, ముగ్గురు మృతి | Huge blast in chemical factory sends shock waves in Dombivali near Mumbai | Sakshi
Sakshi News home page

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు, ముగ్గురు మృతి

Published Thu, May 26 2016 1:42 PM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

Huge blast in chemical factory sends shock waves in Dombivali near Mumbai

ముంబయి: ముంబయి సమీపంలో గురువారం ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు సంభవించి ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. డాంబివాలేలోని ఆచార్య కెమికల్ ఫ్యాక్టరీలో ఈ రోజు ఉదయం ఈ ప్రమాదం జరిగింది. పేలుడు థాటికి ఫ్యాక్టరీ భవనం కుప్పకూలడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.

మరోవైపు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.  కాగా థానే జిల్లా కలెక్టర్ మహేంద్ర కల్యాణ్కర్ పేలుడు ఘటనకు ఫోన్లో ఆరా తీశారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  మరోవైపు ఈ సంఘటనలో ఫ్యాక్టరీ పక్కనే ఉన్న మరో భవనాలు కూడా దెబ్బతిన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement