ఎర్రటి మంటలు.. నల్లటి పొగలు
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఆదివారం ఉదయుం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జీడిమెట్ల ఫేజ్-1లో పద్మావతి కెమికల్స్ పేరుతో డీఆర్ జైన్ సాల్వెంట్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఉదయం 9 గంటల సమయం లో కంపెనీ నుంచి పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మధ్యాహ్నం 12.30 గంటల వరకు దట్టమైన పొగలు కమ్ముకుని, మంటలతో కెమికల్ సాల్వెంట్ డబ్బాలు గాల్లో ఎగిరి పడుతూ ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
కంపెనీలో టౌలిన్, ఇథైల్ ఎసిటేట్, ఐటిఏ, ఎనెగ్జిన్ వంటి రసాయనాలతో కూడిన డ్రమ్ములు ఉండగా ఇందులో ఎనెగ్జిన్, టౌలిన్ పెట్రోలియాన్ని తలపించేలా ఉంటాయి. శనివారం రాత్రే టౌలిన్ తీసుకువచ్చి డ్రమ్ముల్లో డంప్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆదివారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగగా ఈ డ్రమ్ములు గాల్లో ఎగురుతూ భయాన్ని రేకెత్తించాయి. ఈ ఘటనతో పక్కనే ఉన్న సూర్య ఇండస్ట్రీ ఎక్విప్‌మెంట్, సిమ్‌టెక్ కంపెనీల కార్మికులు పరుగులు తీశారు.
ఈ రెండు కంపెనీలకూ మం టలు వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి భారీ ప్రమాదాన్ని నివారించారు. సాల్వెం ట్ నిల్వ చేసిన గోదాము మాత్రం పూర్తిగా దగ్ధమైంది. నష్టం ఎంత ఉంటుందన్న విషయం స్పష్టంగా తెలియరాలేదు. నష్టం కోట్లలో ఉంటుందని అగ్నివూపక అధికారు లు అంచనా వేస్తున్నారు. జీడిమెట్ల, సికింద్రాబాద్, మౌలాలి, కూకట్‌పల్లి, సనత్‌నగర్, మాదాపూర్ ఫైర్ స్టేషన్ల నుంచి వచ్చి ఫైర్ సిబ్బంది వుూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు.