![Fire Accident Chemical Factory Kolhapur Maharashtra - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/24/pjimage%20%2816%29.jpg.webp?itok=Vn0RlaVF)
ముంబై: పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో రసాయన కర్మాగారంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. పూణేకు 250 కిలోమీటర్ల దూరంలోని కొల్హాపూర్ జిల్లాలోని ఇచల్‌కరంజి నగర శివార్లలోని వస్త్ర పారిశ్రామిక ఎస్టేట్‌లో ఉన్న యూనిట్‌లో మంటలు చెలరేగాయి.
సమాచారం అందడంతో ఉదయం 7.30 గంటలకు నాలుగు అగ్నిమాపక ట్యాంకర్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఉదయం 11 గంటలకు మంటలు ఆర్పివేసినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment