
అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. ఈథర్ రసాయనం తయారు చేయు పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బుధవారం తెల్లవారుజామున ఇండస్ట్రీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణ్లాలోనే అగ్ని కీలలు ఫ్లోర్ అంతా వ్యాపించాయి. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు అదృశ్యమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా ఏడుగురు కార్మికుల మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు.
అగ్ని ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియదు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగించినట్లు పేర్కొన్నారు. ప్రమాదానికి అసలు కారణాన్ని వెల్లడిస్తామని తెలిపారు. అయితే.. ఈ ప్రమాదంలో దాదాపు 1.3 మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించినట్లు పరిశ్రమ యజమాని అశ్విన్ దేశాయ్ తెలిపారు.
ఇదీ చదవండి: నూతన రామాలయ ప్రారంభోత్సవంలో పాక్ కళాకారుల ప్రదర్శనలు
Comments
Please login to add a commentAdd a comment