వరంగల్ రూరల్: నర్సంపేట మండలం మహేశ్వరం శివారులో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులను పాకాల కొత్తగూడెం మిషన్ భగీరథ కార్మికులుగా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.