లాతూర్ : మహారాష్ట్రలో సోమవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. లాతూర్‌లోని ఓ పరిశ్రమలో విషవాయువులు పీల్చి ఏడుగురు కార్మికులు మృతిచెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు.
లాతూర్ పారిశ్రామికవాడలోని కీర్తి ఆయిల్ మిల్‌లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువులు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
లాతూర్‌లో విషాదం : ఏడుగురి మృతి
Published Tue, Jan 31 2017 6:54 AM | Last Updated on Tue, Sep 18 2018 7:36 PM
Advertisement
Advertisement