Coal mine workers
-
గుడ్‌న్యూస్! ఒక్కో బొగ్గు గని కార్మికుడికి లక్షన్నర నుంచి రూ.5 లక్షలు..
గోదావరి ఖని: దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఎట్టకేలకు శనివారం ఖరారైంది. 23నెలల ఆలస్యంగా జరిగిన లిఖితపూర్వక వేతన ఒప్పందంపై కోలిండియా యాజమాన్యం, జాతీయ కార్మిక సంఘాల నాయకులు సంతకాలు చేశారు. కోల్‌కత్తాలో రెండు రోజుల పాటు జరిగిన 11వ వేజ్‌బోర్డు 10వ సమావేశంలో కనీస వేతనాలపై 19శాతం పెరుగుదల, అలవెన్స్‌లపై 25శాతం పెరుగుదలతో ఒప్పందం పూర్తయ్యింది. పెరిగిన వేతనాలు జూన్ నుంచి అమల్లోకి రానుండగా, జూలై నుంచి కార్మికులు అందుకోనున్నారు. పెరిగిన 19శాతం కనీస వేతనం బకాయిల మేరకు ఒక్కో కారి్మకునికి రూ.1.50లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఎరియర్స్ రూపంలో 23నెలల బకాయిలు అందనున్నాయి. ద్విచక్రవాహనాలకు పెట్రోల్ అలవెన్స్ చెల్లిస్తున్నట్టుగానే, ఈసారి కార్లకు కూడా చెల్లించేందుకు అంగీకరించింది. ట్రాన్స్‌పోర్టు, అడిషనల్ ట్రాన్స్‌పోర్టు, వాషింగ్ అలవెన్స్‌తో పాటు పలు అలవెన్స్‌లపై 25శాతం పెరిగింది. ఈ ఒప్పందంతో దేశవ్యాప్తంగా 4లక్షల మందికి ప్రయోజనం చేకూరనుండగా, వీరిలో సింగరేణి కారి్మకులు 39వేల మంది ఉన్నారు. సమావేశంలో కోలిండియా చైర్మెన్ ప్రమోద్ అగర్వాల్‌తో పాటు సింగరేణి డైరెక్టర్(పా) బలరాం, పర్సనల్ జీఎం కుమార్‌రెడ్డి, జేబీసీసీఐ వేజ్‌బోర్డు సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య (ఏఐటీయూసీ), జనక్‌ప్రసాద్(ఐఎన్టీయూసీ), రియాజ్ అహ్మద్(హెచ్ఎంఎస్), మంద నర్సింహారావు(సీఐటీయూ), మాధవనాయక్(బీఎంఎస్) పాల్గొన్నారు. -
ఇండోనేసియా బొగ్గు గని ప్రమాదంలో 10 మంది మృతి
జకార్తా: ఇండోనేసియా పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 10 మంది కార్మికులు మరణించారు. మరో నలుగురిని సహాయ బృందం కాపాడింది. ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన గనిలో ప్రమాదకరమైన మిథేన్ వంటి వాయువుల కారణంగానే పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. విషవాయువులు పీల్చడం వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 800 అడుగుల పొడవున్న గని కావడంతో సహాయ చర్యలు కాస్త సంక్లిష్టంగా మారాయి. మరణించిన వారిలో ఎక్కువ మందికి కాలిన గాయాలతో పాటు ఊపిరి సమస్యలు తలెత్తడంతో ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా కొత్త ఎత్తుగడ.. వీధి కుక్కల సాయంతో.. -
బొగ్గు గని కార్మికుల వేజ్‌బోర్డు ఐదేళ్లు
శ్రీరాంపూర్ (మంచిర్యాల)/గోదావరిఖని: సింగరేణి సహా దేశంలోని అన్ని బొగ్గు గనుల 11వ వేజ్ బోర్డు కాలపరిమితి ఐదేళ్లు ఉండేలా ఒప్పందం జరిగింది. బుధవారం ఢిల్లీలోని సామ్రాట్ హోటల్లో కోలిండియా చైర్మన్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన 11వ జేబీసీసీఐ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భేటీలో భాగంగా వేతన ఒప్పందంపై కోలిండియా, సింగరేణి కంపెనీ, 4 జాతీయ సంఘాల ప్రతినిధులు చర్చించారు. నవరత్న, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో వేతన ఒప్పంద కాలపరిమితి 10 ఏళ్లుగా ఉందని, బొగ్గు పరిశ్రమల్లోనూ ఇలానే ఒప్పందాలు చేసుకోవాలని కోలిండియా యాజమాన్యం పట్టుబట్టింది. సంస్థలో పనిచేస్తున్న అధికారులతో పోల్చితే కార్మికుల బేసిక్ ఎక్కువగా ఉంటోందని పేర్కొంది. అయితే ఈ ఒప్పందానికి జాతీయ సంఘాలు ససేమిరా అన్నాయి. ఐదేళ్ల కాలపరిమితికే అంగీకరిస్తామని చెప్పాయి. దీంతో యాజమాన్యం వెనక్కి తగ్గి అంగీకరిస్తూ ఒప్పందం చేసుకుంది. మిగతా జీతభత్యాల విషయం ఈ చర్చల్లో కొలిక్కి రాలేదు. డీపీఈ ప్రకారం వేతనాలు మాకొద్దు కార్మిక సంఘాల డిమాండ్లను పరిష్కరిస్తే ఎంత ఆర్థిక భారం పడుతుందో యాజమాన్యం లెక్కలేసి చెప్పింది. పీఎస్‌యూల్లో ఉన్న వేతనాలకు అనుగు ణంగా బొగ్గు పరిశ్రమల్లోనూ వేతనాలు ఉండాలని సూచించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (డీపీఈ) గైడ్‌లైన్స్ మార్గదర్శకాల ప్రకారం వేతనాలు పెంచుతామంది. కానీ కార్మిక సంఘాల నేతలు డీపీఈ గైడ్‌లైన్స్ ప్రకారం వేతనాలు అంగీకరించబోమన్నారు. వేతనాలు, అలవెన్సు పెరుగుదల, కేడర్ స్కీం, సీపీఆర్ఎంఎస్ మెడికల్ స్కీం సవరణ, పెన్షన్ సవరణ, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వంటి డిమాండ్లను 5 విభాగాలుగా చేసి ప్రత్యేక కమిటీల ద్వారా చర్చిస్తామని యాజమాన్యం ప్రతిపాదించగా కార్మిక సంఘాల నేతలు ఖండించారు. అన్నింటినీ తదుపరి సమావేశాల్లోనే చర్చించాలని డిమాండ్ చేశారు. మిగతా డిమాండ్లపై ఏప్రిల్‌లో జరిగే సమావేశంలో చర్చిస్తామని వేజ్‌బోర్డు సభ్యుడు వి.సీతారామయ్య తెలిపారు. సమావేశంలో లక్ష్మారెడ్డి, మాధవ్నాయక (బీఎంఎస్), రియాజ్ అహ్మద్ (హెచ్ఎమ్మెస్), మంద నర్సింహారావు (సీఐటీయూ) పాల్గొన్నారు. -
మృత్యు కుహరంలో...
ఊరూ పేరులేని...తమకంటూ ఎలాంటి గుర్తింపూ లేని నిర్భాగ్యులు గత పక్షం రోజులుగా మేఘా లయలోని జయంతియా కొండల్లో తవ్వుతున్న అక్రమ గనిలో చిక్కుకున్న తీరు మన ప్రభుత్వాల సమర్థతను ప్రశ్నార్ధకం చేస్తోంది. ఆ అక్రమ గనిలో ప్రమాదం ముంచుకొచ్చే సమయానికి ఎందరు న్నారో, వారిలో ఎంతమంది ప్రాణాలు కాపాడుకున్నారో ఎవరికీ తెలియదు. ఆ గని నిర్వాహకుడు చెబుతున్న ప్రకారమైతే 90మంది సురక్షితంగా బయటకు రాగలిగారు. 15మంది చిక్కుకు పోయారు. అక్రమ గనికి సమీపంలో ప్రవహించే లీతీన్ నది ఉప్పొంగి ఆ నీరంతా అందులోకి చేరిం దని అంటున్నారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా, మైనింగ్ పనిలో పాల్గొనేవారికి అవసరమైన రక్షణ ఉపకరణాలేవీ ఇవ్వకుండా అధికారుల అండతో సాగిస్తున్న ఈ దుర్మార్గం గురించి పర్యావరణవా దులు ఎన్నో ఏళ్లనుంచి పోరాడుతున్నా ఫలితం లేకపోయింది. ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే పోయాయి. కనీసం వారి పిటిషన్లలో ఏముందో చదివి ఉన్నా ఇప్పుడు జరిగిన ప్రమాద తీవ్రత తెలిసేది. నీళ్లు తోడటానికి పక్షం రోజులుగా వినియోగిస్తున్న పంప్సెట్లు పనికిరావని ఇన్నాళ్లకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి, ప్రభుత్వానికి జ్ఞానోదయమైంది. ఆపరేషనంతా పూర్తయ్యేసరికి ప్రమా దంలో చిక్కుకున్నవారు ప్రాణాలతో ఉంటారా అన్నది అనుమానమే. మేఘాలయలో ఉన్న బొగ్గు నిక్షేపాల పరిమాణం 64 కోట్ల టన్నులకు మించి ఉంటుందని చెబుతున్నారు. జాతీయ బొగ్గు ఉత్పత్తిలో ఆ రాష్ట్రం వాటా పది శాతం. మొన్నటి వరకూ మేఘా లయ ప్రధాన ఆదాయ వనరు బొగ్గే. కానీ శాస్త్రీయత లోపించిన మైనింగ్ ప్రక్రియను చక్కదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకునేవరకూ మైనింగ్ ఆపేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఉత్తర్వులివ్వడంతో చట్టబద్ధమైన కార్యకలాపాలు నిలిచిపోయాయి. అక్రమ మైనింగ్ యధావిధిగా సాగుతోంది. మేఘాలయలో బొగ్గు నిల్వలు బాగా లోతున నిక్షిప్తమై ఉంటాయి. వాటిని వెలికి తీయ డానికి ఎలుక కలుగును పోలి ఉండేలా నిలువుగా తవ్వుతారు. బొగ్గు తారసపడ్డాక అక్కడినుంచి సొరంగాలు ఏర్పాటు చేసి బొగ్గు తీస్తారు. ఈ విధానం అశాస్త్రీయమైనదని, దీనివల్ల బొగ్గు వెలికి తీసేవారి ప్రాణాలకు ముప్పు కలగడంతోపాటు పర్యావరణం కూడా నాశనమవుతుందని పర్యావ రణవాదులు వాదిస్తున్నారు. ఈ కలుగులన్నీ నదీ తీరానికి సమీపంలోనే ఉండటం వల్ల వరద ముంచెత్తినప్పుడల్లా వీటిల్లోకి నీరు ప్రవేశిస్తోంది. 2007–14 మధ్య వీటిలో దాదాపు 15,000మంది మరణించి ఉంటారని ఇంపల్స్ అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. జయంతియా కొండలపై కురిసే వర్షాల వల్ల ఏర్పడ్డ నదులు క్షీణదశకు చేరుకుంటున్నాయి. ఎక్కడి కక్కడ గనుల్లో నీరు నిల్వ ఉండిపోవడమే ఇందుకు కారణం. పైగా వెలికి తీసిన బొగ్గును బయటే వదిలేయడం వల్ల నదీ జలాల్లో ఆమ్లాలు అధికమై అవి తాగడానికి, పంటలకు కూడా పనికి రాకుండా పోతున్నాయి. జనం ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇన్ని ప్రమాదాలు ఇమిడి ఉన్న మైనింగ్ చుట్టూ రాజకీయాలు పరిభ్రమించడం ఆశ్చర్యం కలిగి స్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్పీపీ–బీజేపీ కూటమిలోని పార్టీలు, గతంలో రాష్ట్రాన్నేలిన కాంగ్రెస్ కూడా మైనింగ్ యజమానులకు మద్దతుగానే నిలబడ్డాయి. మొన్న ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో పోటీచేసినవారిలో 30శాతంమంది గనుల యజమానులే. ఎన్జీటీ ఉత్తర్వుల వల్ల తమ జీవనాధారం దెబ్బతిన్నదని, వీటిని వెనక్కు తీసుకోవాలని మైనింగ్ యజమానులు ఉద్యమిస్తే అన్ని పార్టీలు వత్తాసు పలికాయి. పర్యావరణానికి మేం ఒక్కరమే హాని కలిగిస్తున్నామా అన్నది మైనింగ్ యజమానుల ప్రధాన ప్రశ్న! ఎన్జీటీ నిషేధాన్ని ఎత్తేయించడానికి మొన్న ఫిబ్రవరి వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రయత్నించింది. అప్పటి ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడం వల్లే కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలైం దని చెబుతారు. తాము అధికారంలోకొస్తే 8 నెలల్లో దీన్ని పరిష్కరిస్తామని బీజేపీ మేనిఫెస్టో హామీ ఇచ్చింది. ఆతర్వాత ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా మంత్రులతో ఒక కమిటీని కూడా నియమిం చారు. అదెంతవరకూ వచ్చిందోగానీ ఈలోగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే వెలికి తీసిన బొగ్గు నిల్వల్ని అమ్మడానికి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అనుమతుల్ని వచ్చే జనవరి నెలాఖరు వరకూ పొడిగించింది. కానీ మైనింగ్ కార్యకలాపాలు చట్టవిరుద్ధంగా సాగిపోతూనే ఉన్నాయి. వాటి జోలికి పోతే రాజకీయంగా ముప్పు కలుగుతుందని పార్టీలన్నీ భయపడటంతో అధికారులు కూడా ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. బొగ్గు మాఫియా ఎంత బలంగా పనిచేస్తున్నదో చెప్పడానికి 2015 లో జరిగిన ఎస్ఐ హత్యే ఉదాహరణ. చట్టవిరుద్ధంగా తరలుతున్న 32 బొగ్గు లారీలను పట్టుకున్నం దుకు మర్బనియాంగ్ అనే ఎస్ఐని మాఫియా కొట్టి చంపితే ఈనాటికీ అతీగతీ లేదు. ఆయన్ను హత్య చేశారని ఒక పోస్టుమార్టం నివేదిక చెప్పగా, మరో నివేదిక దాన్ని ఆత్మహత్యగా తేల్చింది. అక్రమ మైనింగ్ యాజమాన్యాల దుశ్చర్యలు అన్నీ ఇన్నీ కాదు. మైనింగ్ కలుగులన్నీ కేవలం ఒక మనిషి ప్రవేశించడానికి సరిపోయేంత ఇరుగ్గా ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరిని మాత్రమే లోపలికి పంపడానికి వీలుంటుంది. పైగా దృఢకాయులు పనికిరారు గనుక మైనర్ బాలల్ని ఎక్కు వగా ఇందుకోసం వినియోగిస్తారు. వీరు వందల అడుగుల లోతులకు వెళ్లి అక్కడ అడ్డంగా సొరంగం చేస్తూ బొగ్గు సేకరించాలి. ఈ పిల్లలకు ఒక్కొక్కరికి రోజుకు రూ. 1,000 నుంచి రూ. 2,000 ఇస్తారు. ఇదంతా తెలిసినా పట్టనట్టు వ్యవహరించిన పార్టీలు, ప్రభుత్వమూ కూడా ఈ పాపంలో భాగస్వాములు. చట్టవిరుద్ధమైన మైనింగ్‌ను ఆపలేకపోవడమే కాదు...కనీసం ప్రమా దంలో చిక్కుకున్నవారిని ఎలా కాపాడాలన్న అవగాహన కూడా లేకుండా విలువైన సమయాన్ని వృధా చేసిన పాలకుల తీరు క్షమార్హం కాదు. ఇప్పటికైనా మృత్యు కుహరాలను శాశ్వతంగా మూసేందుకు చర్యలు తీసుకోవాలి. -
అధినేత మనసులో ఏముందో!
బొగ్గు గని కార్మికుల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి ఆలోచన ఏంటి? సంస్థ భవితవ్యంపై ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇచ్చిన హామీలపై గందరగోళం నెలకొన్న తరుణంలో అధినేత మనసులో ఏముంది? ఎందుకని టీబీజీకేఎస్ కమిటీ కూర్పును జాప్యం చేస్తున్నారు? మాట్లాడుకుందాం రండీ! అంటూ పిలిచిన ముఖ్యమంత్రి కార్మిక నేతలకు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి ఎందుకు సుముఖత చూపడం లేదు? సింగరేణి కార్మికులు, నాయకుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి ఇప్పటికే రెండు నెలలు దాటినా ఇంకా గుర్తింపు సంఘం కమిటీ కూర్పు పూర్తి కాకపోవడం అయోమయానికి దారితీస్తోంది. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/రామకృష్ణాపూర్: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పూర్తి స్థాయి కమిటీని నియమించాలని భావించిన ముఖ్యమంత్రి ఆ సంఘం నేతల్ని హైదరాబాద్ రమ్మని ఆహ్వానించారు. వారం రోజులుగా టీబీజీకేఎస్ నేతలు సీఎంఓ కార్యాలయం నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా? అని ఎదురుతెన్నులు చూస్తున్నారు. గుర్తింపు కార్మిక సం ఘం ఎన్నికలు జరిగి రెండు నెలలు దాటింది. ఎట్టకేలకు ఈ నెల 5న «చీఫ్ లేబర్ కమిషనర్ (సీఎల్సీ) నుంచి సింగరేణి సీఎండీకి గుర్తింపు యూనియన్‌కు సంబంధించిన లేఖ అందింది. అయినా టీబీజీకేఎస్ రాష్ట్ర, ఏరియాల కమిటీలు ఎంపికపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల కరీంనగర్ పర్యటన సందర్భంగా సీఎం సైతం ‘మాట్లాడుకుందాం రండి’ అని చెప్పడంతో కమిటీల ఎంపిక ఇక కొలిక్కి వచ్చినట్లేనని అనుకున్నారు. కాని వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పట్లో కమిటీల కూర్పు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. రాజకీయ సమీకరణాలతోనే ఆలస్యం..! టీబీజీకేఎస్ కమిటీల ఏర్పాటుకు రాజకీయ జోక్యం ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. గుర్తిం పు కార్మిక సంఘం ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న కొన్ని రాజకీయ పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. గతంలో ఐఎన్టీయూసీలో జాతీయ నేతగా పని చేసిన మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు టీబీజీకేఎస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఎంపీ కవిత గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. ఆయనతోపాటు ఏరి యాల వారీగా కొందరు నేతలు టీబీజీకేఎస్‌లో చేరారు. మరోవైపు మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేకానంద టీఆర్ఎస్లో చేరా రు. వీరి రాకతో రాజకీయ సమీకరణాల్లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీరితో పా టు మరికొన్ని జాతీయ కార్మిక సంఘాలకు చెం దిన వారు, టీడీపీ అనుబంధ టీఎన్టీయూసీ నుంచి ఒకరిద్దరు నేతలు టీబీజీకేఎస్‌లో చేరా రు. ఇలా పలు పార్టీలు, పలు కార్మిక సంఘాల నుంచి నేతల తాకిడి నేపథ్యంలో రాజకీయ జోక్యం కమిటీల కూర్పునకు ప్రతిబంధకంగా మారిందా అనే అనుమానాలకు తావిస్తోంది. మాజీ నాయకుల దూరం? సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో అధికార టీబీజీకేఎస్ గెలుపుకోసం సార్వత్రిక ఎన్నికల స్థాయిలో కష్టపడాల్సి వచ్చింది. వారసత్వ ఉద్యోగాలపై స్పష్టత లేకపోవం దీనికి ఓ కారణమైతే... గత నాలుగేళ్లు సింగరేణిలో పాలన సాగించిన గుర్తిం పు సంఘం నేతల వైఖరి మరో కారణం. మెడికల్ అన్‌ఫిట్‌ల విషయంతో పాటు కార్మికుల పక్షాన నిలవాల్సిన నాయకులు కొందరు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారినట్లు అధిష్టానా నికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయాన్ని ఎన్ని కల ప్రచార సభల్లో ఎంపీ బాల్క సుమన్‌తో పాటు సీఎంఓ నుంచి పరిశీలకులుగా వచ్చి న నేతలు కూడా ఒప్పుకుంటూ... ‘టీబీజీకేఎస్ గెలిచిన తరువాత కొత్త కమిటీని మేమే నియమిస్తాం’ అని స్పష్టం చేశారు. అలాగే టీబీజీకేఎస్ నాయకులను ఎన్నికల ప్రచార సభల్లో కూడా కనిపించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అంటే ప్రస్తుత టీబీజీకేఎస్ నేతల ప్రమేయం లేకుండా ఎంపీ కవిత, ప్రభుత్వ సలహాదారు వివేక్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌లతో పాటు ముఖ్యమైన ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే కొత్త కమిటీ కూర్పు ఉంటుందని అప్పుడే స్పష్టమైంది. వీరినుంచి సూచనలు తీసుకొని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తింపు సంఘం కార్యవర్గానికి తుదిరూపం ఇచ్చే అవకాశం ఉంది. నెలాఖరుకల్లా స్పష్టత? ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పూర్తిస్థాయి కమిటీల ఎంపిక ప్రక్రియ ఈ నెలఖారు దాకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 19వ తేదీ వరకు ప్రపంచ తెలుగు మహాసభలు పూర్తి కానున్నాయి. డిసెంబర్ మూడో వారం వస్తుంది కనుక మరో రెండుమూడు రోజుల పాటు కమిటీల కూర్పుపై కసరత్తు చేసి చివరి వారంలో అధికారికంగా ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయని ఓ ఎంపీ తెలిపారు. కమిటీల ఎంపికపై ముఖ్యమంత్రి వద్ద స్పష్టమైన జాబితా ఉందని, కేవలం తమ ముందు ప్రతిపాదనలు పెట్టి ఆయా కమిటీలను స్వయంగా కేసీఆర్ ప్రకటించే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కాగా కారుణ్య నియామకాలు ఇతరత్రా హక్కుల అమలు కోసం పడిగాపులు కాస్తున్న కార్మికులు మాత్రం ఇంకా కలవరానికి గురవుతున్నారు. కమిటీలు ఇలా జాప్యం జరుగుతుంటో తమ సమస్యలు సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సీఎం కార్యాలయం నుంచి అందిన ఆదేశాల పుణ్యమా అని టీబీజీకేఎస్‌కు చెందిన ఏ నాయకుడు జీఎం కార్యాలయాల వైపు కన్నెత్తి చూడడం లేదని, చిన్నచిన్న పనులు సైతం పెండింగ్‌లో పడిపోతున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా అధినేత తన మనసు విప్పి తమకు న్యాయం చేసే దిశగా కమిటీల కూర్పునకు తుది రూపం ఇస్తే బాగుంటుందని కార్మికవర్గం కోరుతోంది. -
బోనస్ రూ.57 వేలు
♦ కోల్కత్తా సమావేశంలో నిర్ణయం ♦ గని కార్మికులకు దీపావళి ముందు చెల్లింపు గోదావరిఖని(రామగుండం) : దేశవ్యాప్తంగా కోల్ఇండియా, సింగరేణి సంస్థలలో పనిచేస్తున్న 3.50 లక్షలమంది బొగ్గుగని కార్మికులకు పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు (పీఎల్ఆర్) బోనస్ (లాభాల బోనస్)ను రూ.57 వేలు చెల్లించేందుకు నిర్ణయం జరిగింది. కోల్‌కత్తాలో మంగళవారం జేబీసీసీఐ అఫెక్స్ కమిటీసమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. గత ఏడాది పీఆర్ఎల్ బోనస్ రూ.54 వేలుగా ఉండగా, ఈసారి రూ.57 వేలకు పెంచారు. కోల్‌ఇండియాలోని ఎనిమిది సబ్సిడరీ సంస్థలలో పనిచేసే కార్మికులకు దసరా పండుగకు ముందు అంటే ఈ నెల 26వ తేదీలోపు చెల్లిస్తుండగా...సింగరేణి కార్మికులకు మాత్రం దీపావళి పండుగకు ముందు యాజమాన్యం చెల్లించనున్నది. డిపెండెంట్ ఎంప్లాయిమెంట్‌పై కమిటీ ఏర్పాటు... జేబీసీసీఐ ఒప్పందం ప్రకారం డిపెండెంట్ ఉద్యోగాలపై యాజమాన్య ప్రతినిధులు, జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీని నియమించారు. గనిలో ప్రమాదంలో మరణించిన, సహజ మరణం పొందినా గతంలో కార్మికుడి వారసుడికి ఉద్యోగ అవకాశం కల్పించేవారు. ఈవిషయమై సుధీర్ఘంగా చర్చించేందుకు యాజమాన్యం తరపున ఎస్ఈసీఎల్ సీఎండీ బీఆర్ రెడ్డి, ఈసీఎల్ డైరెక్టర్ (పర్సనల్) కేఎస్ పాత్రో, ఎంసీఎల్ డైరెక్టర్ (పర్సనల్) ఎల్ఎన్ మిశ్రా, సీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) డీకే ఘోష్, యాజమాన్యాల తరపున హెచ్ఎంఎస్ నుంచి నాతూలాల్‌పాండే, సీఐటీయూ నుంచి డీడీ రామానందన్, బీఎంఎస్ నుంచి వైఎన్ సింగ్, ఏఐటీయూసీ నుంచి లకన్‌లాల్ మహాతో, సీఎంవోఏఐ నుంచి వీపీ సింగ్ సభ్యులుగా నియమించారు. వీరిని సమన్వయ పరిచేందుకు ఏకే సక్సేనాను కో–ఆర్డినేటర్‌గా నియమించారు. బొగ్గు పరిశ్రమలో ఏడు రోజుల పని విధానం, ఇతర అంశాలపై వచ్చేనెల 9న డ్రాఫ్ట్ కమిటీ సమావేశం, 10న పూర్తిస్థాయి జేబీసీసీఐ సమావేశం నిర్వహించేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి బి.జనక్‌ప్రసాద్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు తెలిపారు. -
అడ్వాన్సు మాఫీ..ఉత్తమాటేనా?
మంచిర్యాల సిటీ : ‘నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రెలు అయినట్టు’ సింగరేణి బొగ్గు గని కార్మికుల పరిస్థితి ఉంది. సింగరేణిలో కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో నష్టపోయారని భావించి కార్మిక సంఘాల ఒత్తిడి మేరకు యాజమాన్యం ప్రతి కార్మికుడికి రూ.25 వేలు అడ్వాన్సుగా ఇచ్చింది. యాజమాన్యం ఇచ్చిన అడ్వాన్సును మాఫీ చేయిస్తామని గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్ ఇప్పుడు ఆ విషయాన్ని ఎత్తడం లేదు. యాజమాన్యం కూడా అడ్వాన్సును తిరిగి వసూలు చేసుకుంది. ఇచ్చిన హామీని గుర్తింపు సంఘం విస్మరించడంతో కార్మిక వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రకటన కూడా చేయించకపోవడం శోచనీయం. ఢిల్లీలో అమలు కావలసిన ఆదాయపు పన్ను సమస్యను రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించిన కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు స్థానికంగా ముఖ్యమంత్రితో ప్రకటన కూడా చేయించలేకపోయారనే విమర్శ వెల్లువెత్తుతోంది. దీంతో కార్మికులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. గురువారం హైదరాబాద్‌లో గుర్తింపు సంఘంతో యాజమాన్యం చర్చలు జరుపనుంది. ఈ సందర్భంలోనైనా అడ్వాన్సు గురించి మాట్లాడుతారా అని కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఏం జరిగింది సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కార్మికులు తమ హక్కుల కోసం కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2011లో 38 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె విజయవంతం అనంతరం 2012 జూన్ 23న గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ముందు సమ్మెలో కార్మికులు ఆర్థికంగా నష్టపోయారని భావించి కార్మిక సంఘాలు యాజమాన్యాన్ని ఒప్పించి ప్రతి కార్మికుడికి 2011 నవంబరు మాసంలో రూ.25 వేలు అడ్వాన్సు రూపంలో ఇప్పించారు. కార్మికులకు ఇచ్చిన అడ్వాన్సును రద్దు చేయిస్తామని ఎన్నికల ప్రచారంలో గుర్తింపు సంఘంగా గెలిచిన టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకెఎస్ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో టీబీజీకెఎస్ గెలిచిన నాటి నుంచి సంఘం అంతర్గత కుమ్ములాటలో పడి సమస్య పక్కకుపోయింది. ఇదే అదనుగా భావించిన యాజమాన్యం ఇచ్చిన అడ్వాన్సును కార్మికుల నుంచి ముక్కు పిండి మరీ వారి వేతనాల నుంచి నెలకు రూ.1,500ల చొప్పున వసూలు చేసుకొంది. నష్టం 38 రోజుల సమ్మె కాలంలో సింగరేణి సంస్థ రోజుకు రెండు లక్షల టన్నుల చొప్పున 64 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టపోయింది. దీంతో టన్నుకు రూ.2వేల చొప్పున రూ.1,280 కోట్లు సంస్థకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. కార్మికులు కూడా సగటున రూ.50 నుంచి రూ.70 వేల వరకు ఒక్కొక్క కార్మికుడు వేతన రూపంలో నష్టపోయారు. కొసమెరుపు తన చేతిలో ఉన్న అస్త్రాన్ని ఉపయోగించి కార్మికులకు మేలు చేయాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సమస్యను పరిష్కారం చేస్తామంటూ ఆదాయపు పన్ను రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయడం కార్మికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.