Hotel collapses
-
చైనాలో రెస్టారెంట్ కూలి 17 మంది మృతి
బీజింగ్: ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్సులో ఒక రెస్టారెంటు కుప్పకూలి 17 మంది మరణించారు. లిన్ఫెన్ అనే పట్టణంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రెండంతస్తుల ఈ హోటల్ భవనం శిథిలాల నుంచి మొత్తం 45 మందిని బయటకు తీశారు. వీరిలో 17 మంది విగతజీవులుగా బయటపడగా, 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. భవనం కూలిపోవడానికి కారణాలేమిటనేది వెంటనే తెలియరాలేదు. -
చౌటుప్పల్లో కుప్పకూలిన హోటల్
నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ పోలీసు స్టేషన్కు ఎదురుగా ఉన్న హోటల్ ఈ రోజు తెల్లవారుజామున కుప్పకూలింది. దాంతో పోలీసులతోపాటు స్థానికులు సహయక చర్యలు చేపట్టారు. ఆ హోటల్ శిథిలాల కింద ఒకరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ఘటన తెల్లవారుజామున జరగడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు తెలిపారు. కాగా శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తి మృతి చెందాడా లేక బతికి ఉన్నాడా అనే విషయం ఇప్పుడే చెప్పలేమన్నారు.