చైనా సరిహద్దుల్లో పెరిగిన దళాలు | India increases troops along China border in Arunachal | Sakshi
Sakshi News home page

చైనా సరిహద్దుల్లో పెరిగిన దళాలు

Published Sun, Apr 1 2018 3:38 AM | Last Updated on Mon, Aug 20 2018 5:23 PM

India increases troops along China border in Arunachal - Sakshi

కిబిథు (అరుణాచల్‌ ప్రదేశ్‌): చైనాతో ఏర్పడిన డోక్లాం వివాదం తర్వాత అరుణాచల్‌ ప్రదేశ్‌–టిబెట్‌ సరిహద్దుల్లో భారత్‌ మరింత ఎక్కువ సంఖ్యలో బలగాలను మోహరించింది. దిబాంగ్, డౌ–డెలాయ్‌ పర్వత ప్రాంతాలు, లోహిత్‌ లోయలో గస్తీని పెంచింది. సరిహద్దులో చైనా కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు మిలిటరీ అధికారులు చెప్పారు.

టిబెట్‌ సరిహద్దుల్లో రెక్కీ నిర్వహించేందుకు హెలికాప్టర్లను ఆర్మీ వాడుతోంది. ‘డోక్లాం వివాదం తర్వాత చైనా సరిహద్దులో మా కార్యకలాపాలు అనేక రెట్లు పెరిగాయి. ఏ సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని కిబిథు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఆర్మీ అధికారి చెప్పారు. సైనికులు చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి ఒక్కో బృందం 15 నుంచి 30 రోజులపాటు వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ నిర్వహిస్తున్నారన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement