Doklam controversy
-
భారత్, చైనాల మధ్య హాట్‌లైన్
బీజింగ్: రక్షణ మంత్రుల స్థాయిలో హాట్‌లైన్ ఏర్పాటుతోపాటు 12 ఏళ్లనాటి రక్షణ ఒప్పందాన్ని పునరుద్ధరించాలనే అంశంపై భారత్, చైనాలు చర్చలు జరుపుతున్నాయి. చైనా రక్షణ మంత్రి వీ ఫెంగ్ గత వారం ఢిల్లీలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి సీతారామన్‌తో సమావేశమయ్యారు. వుహాన్‌లో జిన్‌పింగ్, మోదీ మధ్య జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చించారు. డోక్లాం సంక్షోభం వంటివి తలెత్తినప్పుడు రెండు దేశాల సైనికాధికారులు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలనే అంశం కూడా ఇందులో ఉందని చైనా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి బీజింగ్‌లో తెలిపారు. రెండు దేశాల రక్షణ మంత్రులతోపాటు సైనికాధికారుల మధ్య హాట్‌లైన్ ఏర్పాటు, 2006లో భారత్, చైనాల మధ్య కుదిరిన పరస్పర అంగీకార ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు కూడా చర్చలు జరిగాయన్నారు. -
ముస్లిం బ్రదర్హుడ్, ఆరెస్సెస్ ఒక్కటే
లండన్/బెర్లిన్: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అరబ్ దేశాల్లోని రాడికల్ ఇస్లామిస్టు గ్రూపు ముస్లిం బ్రదర్‌హుడ్‌తో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను పోల్చారు. లండన్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. ఆరెస్సెస్ భారత స్వాభావికతను మార్చేయాలని, అన్ని ప్రభుత్వ సంస్థలను తన చేతుల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తోందని రాహుల్ అన్నారు. ‘భారత స్వాభావికతను మార్చాలని ఆరెస్సెస్ చూస్తోంది. ఏ ఇతర పార్టీలు భారత చట్టబద్ధ సంస్థలను తమ చేతుల్లోకి తీసుకోవాలనుకోలేదు. అరబ్ ప్రపంచంలోని ముస్లిం బ్రదర్హుడ్ ఆలోచన లాగే ఆరెస్సెస్ ఉద్దేశ్యాలున్నాయి’ అని అన్నారు. మోదీ సర్కారు నిర్ణయాలనూ విమర్శించారు. సంఘ్ నిర్ణయాన్ని మోదీ అమలుచేశారు ప్రధాని మోదీ తీసుకున్న నోట్లరద్దు నిర్ణయంపైనా రాహుల్ విమర్శలు చేశారు. ‘పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఆరెస్సెస్ వ్యూహమే. ప్రధాని ఆలోచనల్లో రద్దు నిర్ణయాన్ని చొప్పించారు. ఆర్థిక మంత్రి, ఆర్బీఐ ద్వారా అమల్లో పెట్టారు. నోట్లరద్దు ద్వారా చిన్న, మధ్యతరగతి వ్యాపారసంస్థలు భారీగా నష్టపోయాయి’ అని రాహుల్ అన్నారు. ప్రధాని మోదీ జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే చైనాతో డోక్లాం వివాదం తలెత్తి ఉండేదే కాదన్నారు. ‘డోక్లాం ఓ ప్రత్యేక వివాదం కాదు. కొన్ని వరుసఘటనల పరిణామం’ అని అన్నారు. పాకిస్తాన్ విషయంలో మోదీకి ఓ స్పష్టమైన విధానమంటూ ఏదీ లేదన్నారు. పాక్‌తో చర్చలు అంత సులభం కాదన్నారు. అంతకుముందు యూకే విపక్షమైన లేబర్ పార్టీ నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై మాట్లాడారు. బ్రిటన్ వీసా విధానంలో మార్పుల కారణంగా యూకేలో భారతీయ నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తెచ్చారు. విద్వేషాన్ని చిమ్ముతున్నాయి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను కలిపేందుకు ప్రయత్నిస్తుంటే బీజేపీ, ఆరెస్సెస్‌లు విద్వేషాన్ని చిమ్ముతూ దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నాయని బెర్లిన్‌లో (భారతకాలమానం ప్రకారం గురువారం రాత్రి) భారత సంతతి ప్రజలనుద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో రాహుల్ విమర్శించారు. గురునానక్ బోధనల సారమైన భిన్నత్వంలో ఏకత్వం నినాదాన్ని కాంగ్రెస్ తూచ తప్పకుండా పాటిస్తోందన్నారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగడం, యువతకు సరైన ఉపాధికల్పన లేకపోవడం భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అందరిది. ప్రతి ఒక్కరికోసం పనిచేస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని విస్తృతం చేస్తుంది. కానీ నేటి కేంద్ర ప్రభుత్వం వీటన్నింటికీ భిన్నంగా వ్యవహరిస్తోంది’ అని రాహుల్ విమర్శించారు. కాగా, గురునానక్ బోధనలే తనకు స్ఫూర్తి అన్న రాహుల్ వెంటనే 1984 సిక్కు అల్లర్లకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. 2004 నుంచి పదేళ్లపాటు అధికారంలో ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీలో కాస్త అహంకారం వచ్చిందని రాహుల్ అంగీకరించారు. దీని ఫలితంగానే 2014లో పార్టీ ఓడిందన్నారు. 2019లో బీజేపీ వ్యతిరేక కూటమి విజయం సాధిస్తుందన్నారు. ముస్లిం బ్రదర్హుడ్ నేపథ్యమిదీ.. అరబ్ దేశాల్లో అస్తిత్వంలో ఉన్న ముస్లిం బ్రదర్హుడ్ సంస్థ వివిధ దేశాల్లో సున్నీ ముస్లింలతో ఏర్పాటైన బృందం. 1928లో ఈజిప్టులో ఉపాధ్యాయుడైన హసన్ అల్ బన్నా ఈ సంస్థను ప్రారంభించారు. అరబ్ దేశాల్లో ఈ సంస్థకు ఎక్కువ మద్దతుదారులున్నారు. హమాస్ వంటి ఇస్లామిస్ట్ గ్రూపులకూ ముస్లిం బ్రదర్హుడ్ అండదండలున్నాయి. ఇస్లామిక్ సేవాకార్యక్రమాలతోపాటు రాజకీయాల్లో కీలకంగా ఉండడం ఈ సంస్థ లక్ష్యం. ‘ప్రపంచానికి ఇస్లామే పరిష్కారం’ వీరి నినాదం. జోర్డాన్, హమాస్, గాజా, వెస్ట్‌బ్యాంక్‌లలో ఇస్లామిక్ యాక్షన్ ఫ్రంట్ పేరుతో రాజకీయ పార్టీని పెట్టింది. ఈజిప్టులో ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. సౌదీ అరేబియా ఆరంభంలో ఈ సంస్థకు అండగా నిలిచింది. ప్రస్తుతం కఠినంగా వ్యవహరిస్తోంది. 2011లో హోస్నీ ముబారక్‌కు వ్యతిరేకంగా ఈజిప్టులో విప్లవం (జాస్మిన్ విప్లవం అని పేరు) ముస్లిం బ్రదర్హుడ్ నేతృత్వంలో జరిగింది. 2012లో ఈజిప్టులో మహ్మద్ మోర్సీ నాయకత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఆరంభంలో ఈ సంస్థకు అనుకూలంగా ఉన్నా .. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటం కారణంగా తర్వాత ఆంక్షలు విధించింది. 2015లో బహ్రెయిన్, ఈజిప్టు, రష్యా, సిరియా, సౌదీ, యూఏఈలు ముస్లిం బ్రదర్‌హుడ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించాయి. ప్రస్తుతానికి ఖతార్, టర్కీలు ఈ సంస్థకు అండగా ఉన్నాయి. ‘ఇస్లామిక్ సంస్కరణలు తీసుకుకొచ్చేందుకు రాజకీయ సంస్కరణలు ముఖ్యమని మేం భావిస్తాం. రాజకీయ బహుళత్వం, ప్రజాస్వామ్యం, అధికార మార్పిడిపై విశ్వాసముంది. ఇస్లామిక్ సంస్కరణలంటే ప్రజలకు స్వేచ్ఛ కల్పించడం, రాజకీయ పార్టీలను ఏర్పాటుచేసుకునే హక్కునివ్వడం మొదలైనవి’ అని ఈ సంస్థ తన వెబ్సైట్ పేర్కొంది. -
చైనా సరిహద్దుల్లో పెరిగిన దళాలు
కిబిథు (అరుణాచల్ ప్రదేశ్): చైనాతో ఏర్పడిన డోక్లాం వివాదం తర్వాత అరుణాచల్ ప్రదేశ్–టిబెట్ సరిహద్దుల్లో భారత్ మరింత ఎక్కువ సంఖ్యలో బలగాలను మోహరించింది. దిబాంగ్, డౌ–డెలాయ్ పర్వత ప్రాంతాలు, లోహిత్ లోయలో గస్తీని పెంచింది. సరిహద్దులో చైనా కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు మిలిటరీ అధికారులు చెప్పారు. టిబెట్ సరిహద్దుల్లో రెక్కీ నిర్వహించేందుకు హెలికాప్టర్లను ఆర్మీ వాడుతోంది. ‘డోక్లాం వివాదం తర్వాత చైనా సరిహద్దులో మా కార్యకలాపాలు అనేక రెట్లు పెరిగాయి. ఏ సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని కిబిథు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఆర్మీ అధికారి చెప్పారు. సైనికులు చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి ఒక్కో బృందం 15 నుంచి 30 రోజులపాటు వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ నిర్వహిస్తున్నారన్నారు. -
ఎలిఫెంట్ - డ్రాగన్ డాన్స్ చేయాలి
బీజింగ్ : చైనీస్ డ్రాగన్, ఇండియన్ ఎలిఫెంట్ కలిసి డాన్స్ చేయాలే తప్ప కొట్టుకోకూడదని చైనా-భారత్ సంబంధాల గురించి చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య తలెత్తిన విబేధాలు సమసిపోవాలంటే సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అపుడే ద్వైపాక్షిక ఒప్పందాల అమలు జరుగుతుందన్నారు. పార్లమెంట్ సెషన్లో భాగంగా నిర్వహించిన పత్రికా సమావేశంలో పాల్గొన్న వాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సర కాలంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న విభేదాల గురించి ప్రశ్నించగా... డోక్లాం వివాదం వంటి కొన్నిఅంశాల కారణంగా విభేదాలు తలెత్తినప్పటికీ, చైనా- భారత్ తమ సంబంధాలు మెరుగుపరచుకునేందుకు కృషి చేస్తున్నాయన్నారు. చైనా తన హక్కులు కాపాడుకునేందుకు చట్టబద్ధంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతుందన్నారు. చైనా-భారత్ కలిసి పనిచేస్తే ఒకటి ఒకటి కూడితే రెండు కాదు.. పదకొండు అవుతుందని చమత్కరించారు. తమ మధ్య ఉన్న స్నేహానికి హిమాలయాలు కూడా అడ్డుగా నిలవలేవని వ్యాఖ్యానించారు. గతంలో నెలకొన్న ఘర్షణలు, విభేదాలు మరచిపోయి ఇరు దేశాలు అనుమానాలకు బదులు, నమ్మకాన్ని పెంపొందించుకుని.. సహకారం అందించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అనుసరిస్తున్న విధానాలు చైనా బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ పై ప్రభావం చూపిస్తుందా అన్న ప్రశ్నకు సమాధామివ్వడానికి నిరాకరించారు. బెల్ట్ రోడ్ అంశానికి సుమారు 100 దేశాలు మద్దతునిచ్చాయని, అయినప్పటికీ ఈ విషయమై మీడియా అత్యుత్సాహం చూపిస్తోందని విమర్శించారు. ఆసియా దేశాలు, ఆఫ్రికా, చైనా, యూరప్‌ల మధ్య అనుసంధానానికి ఉద్దేశించిన ఈ నిర్మాణాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారన్నారు. కాగా ఈ నిర్మాణంతో, చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్ అనుసంధానమై ఉండటంతో భారత్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా నిర్మిస్తున్న చైనా- పాక్ ఎకనమిక్ కారిడార్, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలంటూ ఐక్యరాజ్య సమితిలో వ్యక్తమైన అభిప్రాయాలను చైనా వ్యతిరేకించడం, అణు సరఫరాదారుల బృందంలో భారత్ చేరకుండా అడ్డుపడటం వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. గతేడాది 73 రోజులపాటు భారత్- చైనాలు డోక్లాం కోసం బలగాలు మొహరించాయి. పలు చర్చల అనంతరం ఆగస్ట్ 28 తర్వాత చైనా తన సైన్యాన్ని ఉపసంహరించుకుని, అక్రమంగా చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
చర్చలతోనే వివాద పరిష్కారం
బీజింగ్: ప్రతిష్టాత్మక చైనా కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. పార్టీ 19వ సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన అధ్యక్షుడు షి జిన్‌పింగ్.. కీలక అంతర్గత, అంతర్జాతీయ అంశాలపై దేశ, పార్టీ విధానాలను సమావేశాలకు హాజరైన దాదాపు 2 వేల మంది ప్రతినిధులకు వివరించారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటున్నామని, అన్ని సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా సామరస్యంగానే పరిష్కరించుకోవాలన్నది తమ అభిమతమని జిన్‌పింగ్ స్పష్టం చేశారు. అయితే, ఆ ప్రక్రియలో దేశ వ్యూహాత్మక ప్రయోజనాలను పణంగా పెట్టబోమని తేల్చిచెప్పారు. డోక్లాం వివాదం నేపథ్యంలో జిన్‌పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చైనా సైన్యాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరిస్తామని, తైవాన్ స్వాతంత్య్రాన్ని అంగీకరించబోమని, అవినీతిపై ఉక్కుపాదం కొనసాగుతుందని, విస్తరణవాదం ద్వారా అభివృద్ధి సాధించాలనే విధానానికి చైనా వ్యతిరేకమని.. ఇలా పలు ముఖ్యమైన అంశాలపై దేశ విధానాలను స్పష్టీకరించారు. చరిత్రాత్మక తియనన్మెన్ స్క్వేర్ పక్కనే ఉన్న గ్రేట్ హాల్లో వారం రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాలతో పార్టీ లో, ప్రభుత్వంలో తన పట్టును మరింత బలోపేతం చేసుకునే దిశగా షి జిన్‌పింగ్ ముందడుగు వేస్తున్నారు. కీలక అంశాలపై జిన్‌పింగ్ వ్యాఖ్యలు.. ఆయన మాటల్లోనే! ‘పొరుగు’తో పరిష్కారానికి చిత్తశుద్ధితో.. స్నేహం, చిత్తశుద్ధి, పరస్పర ప్రయోజనాలు, సమగ్రత, భాగస్వామ్యం, మితృత్వ విధానాలకు అనుగుణంగా పొరుగుదేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవటమే చైనా ఉద్దేశం. చర్చల ద్వారా ప్రస్తుతం నెలకొన్న విబేధాలను పరిష్కరించుకునేందుకు చిత్తశుద్ధితో ఉన్నాం. అయితే, మా ప్రయోజనాలు దెబ్బతినే ఏ విషయాన్నీ అంగీకరించం. సవాళ్లను, అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. విస్తరణవాదంతో అభివృద్ధి చెందాలనేది మా విధానం కాదు. ఆర్మీ బలోపేతంపై మిషన్ 2020 పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)ను బలోపేతం చేయటం చాలా కీలకం. పీఎల్ఏను ప్రపంచస్థాయి శక్తిగా మారుస్తాం. 2020 కల్లా ఈ లక్ష్యాలను చేరుకునేందుకు ఐటీ, వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించేందుకు కార్యక్రమాలు చేపట్టనున్నాం. 2035కల్లా పీఎల్ఏను పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తాం. తైవాన్ స్వాతంత్య్రాన్ని అంగీకరించం స్వతంత్రంగా ఉండేందుకు తైవాన్ చేస్తున్న ప్రయత్నాలను విజయవంతం కానీయబోం. చైనా భూభాగం నుంచి ఏ భాగమైనా, ఎవరైనా, ఏ సంస్థ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా విడిపోయేందుకు ప్రయత్నిస్తే అనుమతించే ప్రసక్తే లేదు. కావాలంటే, హాంకాంగ్, మకావ్‌ల్లో జరుగుతున్నట్లు ఒక దేశం రెండు వ్యవస్థల విధానం ద్వారా శాంతియుత పద్ధతిలో పాలన కొనసాగించుకునేందుకు అంగీకరిస్తాం. తైవాన్ అభివృద్ధికి మనస్ఫూర్తిగా సహాయం చేస్తాం. బలమైన ఆర్థిక వ్యవస్థగా.. గత ఐదేళ్లలో చైనా ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. ఐదేళ్లలో 12.1 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. ప్రపంచ ఆర్థిక శక్తుల సరసన చైనాను అగ్రస్థానంలో నిలిపేలా స్థిర వృద్ధి రేటుతో ముందుకెళ్తున్నాం. సరఫరాలో సంస్కరణల ద్వారా ఆర్థిక నిర్మాణం స్థిరంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఐదేళ్లలో వ్యవసాయ ఆధునికీకరణలోనూ గణనీయమైన మార్పులు సాధించాం. ప్రపంచ వాణిజ్యానికి చైనా నాయకత్వం వహిస్తోంది. విదేశాల్లో పెట్టుబడులు, విదేశీ మారక నిల్వలు పెరిగాయి. ఐదేళ్లలో 6 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం. ప్రపంచానికే ‘చైనా’ మోడల్ 2020 కల్లా ఆధునిక, సుసంపన్న దేశంగా చైనా ఎదగనుంది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు చైనా మోడల్‌ను అందిపుచ్చుకుంటాయి. దశాబ్దాల నిరంతర శ్రమ ఫలితమే ఇది. ప్రపంచ రాజకీయ, ఆర్థిక, మిలటరీ, పర్యావరణ అంశాల్లో చైనా ఓ ప్రబలశక్తిగా మారేందుకు సమయం ఆసన్నమైంది. పార్టీ పునర్నిర్మాణం గురించి సీపీసీని పునర్నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది. చైనా పునరుజ్జీవనం కోసం భారీ అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించాలి. సోషలిజంలో సరికొత్త శకాన్ని ఆరంభించటం అత్యంత ఆవశ్యకం. పార్టీని కూడా శక్తివంతంగా తయారుచేయటంలో మనమంతా నిరంతరం శ్రమించాలి. పార్టీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ అవినీతే. దీనిపై పోరాటం అంత సులువేం కాదు. అయినా తప్పకుండా విజయం సాధిస్తాం. -
జాతి జీవనాడికి ముప్పు
మీ మెడ మీది పెద్ద నరమే మీ ప్రధాన బలహీనతగా ఉన్న ఈ పరిస్థితిని ఎలా అభివర్ణిం చాలి? మన వ్యూహాత్మకమైన ఈ పీడకలనే చైనా గుర్తుచేసింది. పశ్చిమ బెంగాల్, ఈశా న్యంలో నేడు నెలకొన్న అనేక సంక్షోభాలు మనం స్వయంగా సృష్టించుకున్నవి. అవి, తాము అసలు లెక్కలోకేరాని ప్రాంతాన్ని రాజకీయంగా జయించడం కోసం బీజేపీ నిర్వి రామంగా చేస్తున్న కృషి çఫలితాలు. ప్రధాని మోదీ అక్కడి జోక్యందారీ గవర్నర్లను, ఆరె స్సెస్ కమాండోలను, ప్రత్యేక బలగాలను కనీసం తాత్కాలికంగానైనా వెనక్కు పిలవాలి. మనకు ఇంతవరకు తెలియనైనా లె లియకుండా ఉన్న వ్యూహాత్మక వాస్తవి కత, దాని వల్ల కలగనున్న ముప్పు గత మూడు వారాలలో వెల్లడయ్యాయి. నేడు రగులుతున్న డొక్లామ్ వివాదం వెలువరిస్తున్న ఆందోళనకరమైన హెచ్చ రికలు లోతుగా విస్తరించి, ప్రమాదకర స్థాయిలకు చేరుతున్నాయి. చైనా అధి కారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ శుక్రవారం నాటి సంపాదకీయం భారత విదే శాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను అబద్ధాలకోరు అనడమే కాదు, సరిహద్దుల వెంబడి పలు చోట్ల యుద్ధానికి దిగగలమంటూ బెదిరింపులకు దిగింది. ఇది, వదరుబోతుతనానికి తక్కువేమీ కాదు. డొక్లామ్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ భారత్ ఎంతగా సుసంసిద్ధమై ఉన్నా, ఓటమిని ఎదుర్కోక తప్పదని అది పేర్కొంది. భారత్‌తో పోలిస్తే తమ రక్షణ వ్యయం నాలుగు రెట్లు ఎక్కువ (అది తక్కువచేసి చెప్పడమేనని నా అభిప్రాయం), ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు పెద్దది కావడం వల్ల తమదే గెలుపని తెలిపింది. ఈ బెదిరింపులకు, అది వాడిన హేయమైన భాషకు మన దేశంలో ఎవరూ బెదిరిపోవడం లేదు. వాస్తవానికి దీన్ని చూసిన వెంటనే నాకు మన టీవీ చానళ్లలో ఆగ్రహంతో రగిలే యాంకర్లు, మరింత ఆగ్రహంతో ఊగిపోయే రిటైరయిన సైనికాధికారులు యుద్ధోన్మాదంతో ప్రదర్శించే కమాండో–కామిక్ ప్రహసనాలను గుర్తుకు తెచ్చింది. నవ్వుకుని తీసిపారేయాల్సిందిగానే కని పించింది. ప్రభుత్వం మన ‘‘ఉత్తర కొరియా చానళ్ల’’ను (అరుణ్ శౌరీ అమూ ల్యమైన అభివర్ణన) ఇంకా బ్యారక్‌లలోనే ఉంచిందెందుకా? అని మొదట నాకు అనిపించింది. చైనా చానళ్లలాగే మన చానళ్లు కూడా ఎప్పుడూ యుద్ధా నికి సిద్ధమే. కాబట్టి వాటిని ఉసిగొలిపితే చాలు, మనం వాళ్లకు సమ ఉజ్జీలం కావడమే కాదు, అధిగమించిపోతాం. డొక్లామ్ సందేశం మర్మం? కానీ మన మీడియా యోధుల చానళ్లన్నీ ప్రైవేటు యాజమాన్యంలోనివి. అధి కార వ్యవస్థ పంపే సంకేతాలను బట్టి రాజMీ యాలు దట్టించిన యుద్ధాలు సాగించే బాపతు. వాటిలో చాలా వరకు అంతర్గతమైన (చాలావరకు ఊహాత్మకమైన) లేదా బహిర్గతమైన శత్రువులకు వ్యతిరేకంగా సాగించేవే. రంకెలేసే ఈ దేశభక్తి రేటింగ్స్‌తో సమానం. బలమైన ప్రభుత్వం వాటికి అండగా ఉంటే మరీ మంచిది. ప్రభుత్వం వద్ద తమకు ఎంత పలుకుబడి ఉన్నా, విధాన నిర్ణయాల విషయంలో మాత్రం మీడియా నోరు మెదపదు. కాగా, చైనా మీడియా ప్రభుత్వ యాజమాన్యంలోనిది. చైనా ప్రభుత్వం తన వాణిని దాని ద్వారానే వినిపిస్తుంది. కాబట్టి అది ఏమి చెప్పిందో మనం గమనంలోకి తీసుకోవాలి. అది మనల్ని బెదిరించనివ్వకూడదు. అలా అని నవ్వుతూ తీసిపారేసి చానళ్లు మార్చుకుంటూ కూర్చోకూడదు. ప్రపంచ దేశాల చైనా పరిశీలకులు దశాబ్దాల తరబడి ఆ దేశ ప్రభుత్వ మీడియా వ్యాఖ్యానాలను సూక్ష్మంగా విశ్లేషించారు. సదరు గ్లోబల్ టైమ్స్ సంపాదకీయాన్ని చెరిగి, తప్ప తాలూ ఏరిపారేసి ధాన్యాన్ని విడదీస్తే కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి, డొక్లామ్ సంకేతం మాత్రమే, చైనా గాండ్రింపులన్నీ మరో మరింత పెద్ద, వ్యూహాత్మకమైన సమస్యకు సంబంధిం చినవి. గణనీయమైన ఆసియా శక్తిగా భారత్ ఇంకా నటిస్తుండటం పట్ల అది అసంతృప్తితో ఉంది. వాస్తవానికి, చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ పథకం (బీఆర్ఐ) సదస్సును బహిష్కరించిన ఏకైక దేశం భారత్ మాత్రమే. భార త్తో కలసి చతుర్ముఖ కూటమిగా వ్యవహరిస్తున్న అమెరికా, జపాన్, ఆస్ట్రేలి యాలు సైతం ఆ చర్చలకు హాజరయ్యాయి. రెండు, అది ఈ అసంతృప్తిని బహిరంగంగా కాకున్నా, తన బంటు పాకిస్తా¯Œ ద్వారా వ్యక్తం చేస్తూనే ఉంది. మూడవది ముఖ్యమైనది, వారు పంపుతున్న పెద్ద సందేశం. అది మరింత తలబిరుసుతనంతో కూడినది: చాలా తొందరగా మీకు మీరు ఒక పెద్ద శక్తిగా ప్రకటించేసుకున్నారు. కానీ మీరు మా సరసన నిలవగలవారు కారు. మీ ఆర్థిక వ్యవస్థ, సైన్యమూ కూడా చిన్నవి, పైగా పట్టించుకోకుండా వదిలేసిన పలు దీర్ఘకాలిక సమస్యలు కూడా మీకు ఉండి ఉండవచ్చు. మన కీలక బలహీనత ఏది? జపాన్–అమెరికా–భారత్ కూటమి బలపడటం చైనాకు చికాకు కలి గించడం అర్థం చేసుకోగలిగిందే. వారం పాటూ మలబార్ తీరంలో జరిగిన త్రైపాక్షిక నావికా విన్యాసాల తదుపరి ఈ సంపాదకీయం వెలువడింది. చైనాతో సంఘర్షణే జరిగితే జపాన్, అమెరికాలు భారత్‌కు మద్దతుగా నిలుస్తాయని భారత్ భ్రమిస్తోందని, వాటి సహాయం ‘మిథ్యే’ అని అది పేర్కొంది. ఆ తదుపరి ‘‘హిందూ మహా సముద్రంలో ప్రయోగించడానికి తనకొక వ్యూహాత్మకమైన అస్త్రం ఉన్నదని భారత్ ఊహిస్తుంటే అది మరింత అమాయకత్వం. భారత్‌కున్న ప్రాణాంతక బలహీనతను దెబ్బ తీయగల పలు అస్త్రాలు చైనాకు ఉన్నాయి. చైనాతో వ్యూహాత్మకంగా తాడో పేడో తేల్చుకోడానికి తగిన సామర్థ్యం భారత్‌కు లేనే లేదు’’ ఈ ప్రకటనలోని అత్యంత ముఖ్యమైన వాక్యం ఆ తదుపరిదేనని నాకు తోస్తోంది. చైనా తన దౌత్య, వ్యూహాత్మక సందేశాన్ని పంపడానికి ప్రభుత్వ మీడి యాను వాడుకుంటుంది. కాబట్టి అది జాగ్రత్తగా ఆచి తూచి పద ప్రయోగం చేయడంలో ఆరితేరినది. కానీ అది ప్రదర్శించిన తలపొగురుతనం వల్ల నిరక్ష్యంగా నోరు జారి తన మనసులో ఏముందో లేదా వ్యూహం ఏమిటో బయట పెట్టేసి ఉండొచ్చు కూడా. భారత్‌కు ఉన్న కీలక బలహీనతను గురించి అది ప్రస్తావించడమే అందుకు ఉదాహరణ. ఇది ఆగ్రహంతో వ్యూహా త్మకంగా ప్రదర్శించిన నిర్లక్ష్యం. అది, భారత్ మేలుకోవాలని చేసే హెచ్చరిక అయింది. అంటే చైనా, వాస్తవాధీన రేఖ భగ్గుమనేలా, కశ్మీర్ లోయలో హింస మరింత పెరిగేలా చేయడానికి పాకిస్తాన్‌ను ఉసిగొలుపుతుందని అర్థమా? అందులో కొంత వరకు ఇప్పటికే జరుగుతోంది. ఇతర భారత సరిహద్దుల్లో, ప్రత్యేకించి నేపాల్ సరిహద్దుల్లో కొత్త ఉద్రిక్తతలను అది రేకెత్తిస్తుందని అర్థమా? నేటి మన నేపాల్ విధానం ఎంత గందరగోళంగా ఉన్నదో చూస్తే, చైనా ఆ పనిని తనకు ఇష్టమొచ్చినçప్పుడు ఎప్పుడైనా చేయగలదు. తూర్పు– మధ్య భారతం(మావోయిస్టు)లో, ఈశాన్యంలో తిరుగుబాట్లను రేకెత్తిస్తుం దని అర్థమా? ప్రత్యేకించి నాగాలాండ్, అరుణాచల్/అస్సాంలో ఇప్పటికే తిరుబాట్లు రాజుకుంటున్నాయి. ఇవన్నీ చైనా సందేశానికి అర్థమా? లేదంటే అది అంతకు మించినదా? నేడు ఉద్రిక్తతలు రాజుకుంటున్న ప్రాంతానికి సమీపంలో సిక్కింకు ఆనుకుని ఉన్న డార్జిలింగ్ వారాల తరబడి జాతి–భాషాపరమైన హింసతో భగ్గుమంటోంది. డార్జిలింగ్‌ను పాలిస్తున్న పశ్చిమ బెంగాల్ మత కల్లోలంతో అట్టుడుకుతోంది. దాన్ని వాస్తవం కంటే ఎక్కువగా అతిశయీకరిస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితులు తేలికగా చేయి దాటిపోవడం సర్వసాధారణం. డార్జిలింగ్‌కు, రాష్ట్రంలోని కొన్ని సున్నిత మైన జిల్లాలకు ఇటీవలి కొన్ని వారాల్లో సైన్యాన్ని పిలవాల్సి రావడం గమనార్హం. వీటన్నిటి మధ్య నాగాలాండ్ ప్రభుత్వం పడిపోయి, కొత్త (బీజేపీకి మరింత అనుకూలంగా ఉండే) ప్రభుత్వం గవర్నర్ అండతో అధికారంలోకి వచ్చింది. ఇది అక్కడ తెగల మధ్య ఉండే సున్నితమైన అధికార సమతూకాన్ని అస్థిరపరచింది. పైగా శాంతి చర్చలు నిలిచిపోవడానికి, శాంతిని వ్యతిరేకించే గ్రూపులు బలపడటానికి దారితీసింది. ఇదే వారంలో, త్రిపురలో ఆదివాసులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ జాతీయ ర హదారిని దిగ్బంధించారు. డోక్లామ్‌లో చైనా సేనల ఉనికికి సంబంధించి భారత్ ఆందోళనకు ప్రధాన కేంద్రం... దానివల్ల సిలిగురి కారిడార్‌కు కలుగుతున్న ముప్పే. అలాంటి పరిస్థితుల్లో దానిని ఆనుకుని ఉన్న జిల్లాలన్నీ, ఈశాన్యంలోని చాలా భాగం అట్టుడుకు తుండటం జాతి ప్రయోజనాలను పరిరక్షించే పరిణామమేనా? అత్యాశ వీడండి తూర్పు–మధ్య భారతంలోని మావోయిస్టుల సమస్య చైనాకు కొంత అనుకూలమైనదే. అయినా వారు చాలా బలహీనపడిపోయారు. పాకిస్తాన్ మిత్రులు కశ్మీర్ హింసను విస్తరింపజేయడం కొనసాగవచ్చు. అయినా ఇవేవీ మన దేశ కీలక బలహీన త కాకపోవచ్చు. అది, డొక్లామ్‌కు సమీపంగా సిలిగురి కారిడార్‌కు ఆనుకుని అర్థ చంద్రాకారంలో... పశ్చిమ బెంగాల్ జిల్లాల నుంచి తూర్పున బలహీనమైన సరిహద్దులున్న ఈశాన్యం వరకు విస్తరించిన ప్రాంతం. మీ మెడ మీది పెద్ద నరమే (జగ్లార్) మీ ప్రధాన బలహీనతగా ఉన్న ఈ పరిస్థితిని ఎలా అభివర్ణించాలి? వ్యూహాత్మకమైన ఈ పీడకలనే చైనా అనుద్దేశపూర్వకంగా గుర్తుచేసింది. కశ్మీర్, వాస్తవాధీనరేఖల వెంబడి శాంతిని నెలకొల్పడంలో స్పష్టంగానే మనకు పరిమితులున్నాయి. ఆదివాసి మావోయిస్టులు ఓ తలనొప్పి మాత్రమే. అయినా వారిని హడావుడిగా తుడిచిపెట్టేయలేం. అయినా వాళ్లు వ్యూహాత్మకంగా ప్రతికూలమైన అంశం కావడానికి చాలా దూరంలో ఉన్నారు. కానీ పశ్చిమ బెంగాల్, ఈశాన్యం పూర్తిగా భిన్నమైనవి. ప్రత్యేకించి నేడు నెలకొన్న అనేక సంక్షోభాలు స్వయంగా సృష్టించుకున్నవి. వాస్తవానికి అవి, సంప్రదాయకంగా తాము అసలు లెక్కలోకేరాని ప్రాంతాన్ని రాజ కీయంగా జయించడం కోసం బీజేపీ నిర్విరామంగా చేస్తున్న కృషి çఫలితాలు. అది బీజేపీ సృష్టించిన రంధ్రం, దాన్ని అది మూసేయగలదు కూడా. రాజకీయాలు ఎన్నటికీ మన జీవితాలలో లేకుండా పోవు. అయినా ప్రధాని నరేంద్ర మోదీ అంతటి శక్తిని, అధికారాన్ని కలిగిన నేత... అంతర్గతమైన ఈ సంఘర్షణలను నిలిపివేయాలని దృఢంగా ఆదేశించగలుగుతాడు. నాగాలాం డ్లోని నేటి రాజకీయ అస్థిరత, డార్జిలింగ్‌లోని ఆందోళన నుంచి... దిగ్భ్రాం తికరంగా ఈశాన్యంలోకెల్లా శాంతియుతమైనదిగా ఉంటున్న త్రిపురలో ఆది వాసులు తిరుగుబాటుకు దిగడం వరకు అన్నిటిలోనూ ఆయన పార్టీ రాజ కీయ హస్తమే కనిపిస్తోంది. ఆయన అక్కడి జోక్యందారి గవర్నర్లను, ఆర్ఎస్ ఎస్ కమాండోలను, ప్రత్యేక బలగాలను కనీసం తాత్కాలికంగానైనా వెనక్కు పిలవాలి. మనకంటే మరింత బలమైన శత్రువు దేశం ముంగిట నిలుచు న్నాడు. మీరే స్వయంగా సృష్టించిన బలహీనతలను శత్రువు మీకు గుర్తు చేశాడు కూడా. తలబిరుసుతనంతో శత్రువు చేసిన ఆ బుద్ధిమాలిన పనిని వాడుకుని ఇంటిని చక్కబెట్టుకోండి. ఈశాన్యాన్ని జయించే పార్టీ కార్య క్రమాన్ని తర్వాత తిరిగి మొదలెట్టవచ్చు. twitter@shekargupta