జాతి జీవనాడికి ముప్పు | Chinese expert warns of troops entering Kashmir | Sakshi
Sakshi News home page

జాతి జీవనాడికి ముప్పు

Published Sat, Jul 22 2017 1:18 AM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

జాతి జీవనాడికి ముప్పు

జాతి జీవనాడికి ముప్పు

మీ మెడ మీది పెద్ద నరమే మీ ప్రధాన బలహీనతగా ఉన్న ఈ పరిస్థితిని ఎలా అభివర్ణిం చాలి? మన వ్యూహాత్మకమైన ఈ పీడకలనే చైనా గుర్తుచేసింది. పశ్చిమ బెంగాల్, ఈశా న్యంలో నేడు నెలకొన్న అనేక సంక్షోభాలు మనం స్వయంగా సృష్టించుకున్నవి. అవి, తాము అసలు లెక్కలోకేరాని ప్రాంతాన్ని రాజకీయంగా జయించడం కోసం బీజేపీ నిర్వి రామంగా చేస్తున్న కృషి çఫలితాలు. ప్రధాని మోదీ అక్కడి జోక్యందారీ గవర్నర్లను, ఆరె స్సెస్‌ కమాండోలను, ప్రత్యేక బలగాలను కనీసం తాత్కాలికంగానైనా వెనక్కు పిలవాలి.

మనకు ఇంతవరకు తెలియనైనా లె లియకుండా ఉన్న వ్యూహాత్మక వాస్తవి కత, దాని వల్ల కలగనున్న ముప్పు గత మూడు వారాలలో వెల్లడయ్యాయి. నేడు రగులుతున్న డొక్లామ్‌ వివాదం వెలువరిస్తున్న ఆందోళనకరమైన హెచ్చ రికలు లోతుగా విస్తరించి, ప్రమాదకర స్థాయిలకు చేరుతున్నాయి. చైనా అధి కారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ శుక్రవారం నాటి సంపాదకీయం భారత విదే శాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను అబద్ధాలకోరు అనడమే కాదు, సరిహద్దుల వెంబడి పలు చోట్ల యుద్ధానికి దిగగలమంటూ బెదిరింపులకు దిగింది. ఇది, వదరుబోతుతనానికి తక్కువేమీ కాదు. డొక్లామ్‌లోనూ ఇతర ప్రాంతాల్లోనూ భారత్‌ ఎంతగా సుసంసిద్ధమై ఉన్నా, ఓటమిని ఎదుర్కోక తప్పదని అది పేర్కొంది. భారత్‌తో పోలిస్తే తమ రక్షణ వ్యయం నాలుగు రెట్లు ఎక్కువ (అది తక్కువచేసి చెప్పడమేనని నా అభిప్రాయం), ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు పెద్దది కావడం వల్ల తమదే గెలుపని తెలిపింది.

ఈ బెదిరింపులకు, అది వాడిన హేయమైన భాషకు మన దేశంలో ఎవరూ బెదిరిపోవడం లేదు. వాస్తవానికి దీన్ని చూసిన వెంటనే నాకు మన టీవీ చానళ్లలో ఆగ్రహంతో రగిలే యాంకర్లు, మరింత ఆగ్రహంతో ఊగిపోయే రిటైరయిన సైనికాధికారులు యుద్ధోన్మాదంతో ప్రదర్శించే కమాండో–కామిక్‌ ప్రహసనాలను గుర్తుకు తెచ్చింది. నవ్వుకుని తీసిపారేయాల్సిందిగానే కని పించింది. ప్రభుత్వం మన ‘‘ఉత్తర కొరియా చానళ్ల’’ను (అరుణ్‌ శౌరీ అమూ ల్యమైన అభివర్ణన) ఇంకా బ్యారక్‌లలోనే ఉంచిందెందుకా? అని మొదట నాకు అనిపించింది. చైనా చానళ్లలాగే మన చానళ్లు కూడా ఎప్పుడూ యుద్ధా నికి సిద్ధమే. కాబట్టి వాటిని ఉసిగొలిపితే చాలు,  మనం వాళ్లకు సమ ఉజ్జీలం కావడమే కాదు, అధిగమించిపోతాం.

డొక్లామ్‌ సందేశం మర్మం?
కానీ మన మీడియా యోధుల చానళ్లన్నీ ప్రైవేటు యాజమాన్యంలోనివి. అధి కార వ్యవస్థ పంపే సంకేతాలను బట్టి రాజMీ యాలు దట్టించిన యుద్ధాలు సాగించే బాపతు. వాటిలో చాలా వరకు అంతర్గతమైన (చాలావరకు ఊహాత్మకమైన) లేదా బహిర్గతమైన శత్రువులకు వ్యతిరేకంగా సాగించేవే. రంకెలేసే ఈ దేశభక్తి రేటింగ్స్‌తో సమానం. బలమైన ప్రభుత్వం వాటికి అండగా ఉంటే మరీ మంచిది. ప్రభుత్వం వద్ద తమకు ఎంత పలుకుబడి ఉన్నా, విధాన నిర్ణయాల విషయంలో మాత్రం మీడియా నోరు మెదపదు. కాగా, చైనా మీడియా ప్రభుత్వ యాజమాన్యంలోనిది. చైనా ప్రభుత్వం తన వాణిని దాని ద్వారానే వినిపిస్తుంది. కాబట్టి అది ఏమి చెప్పిందో మనం గమనంలోకి తీసుకోవాలి. అది మనల్ని బెదిరించనివ్వకూడదు. అలా అని నవ్వుతూ తీసిపారేసి చానళ్లు మార్చుకుంటూ కూర్చోకూడదు.

ప్రపంచ దేశాల చైనా పరిశీలకులు దశాబ్దాల తరబడి ఆ దేశ ప్రభుత్వ మీడియా వ్యాఖ్యానాలను సూక్ష్మంగా విశ్లేషించారు. సదరు గ్లోబల్‌ టైమ్స్‌ సంపాదకీయాన్ని చెరిగి, తప్ప తాలూ ఏరిపారేసి ధాన్యాన్ని విడదీస్తే కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి, డొక్లామ్‌ సంకేతం మాత్రమే, చైనా గాండ్రింపులన్నీ మరో మరింత పెద్ద, వ్యూహాత్మకమైన సమస్యకు సంబంధిం చినవి. గణనీయమైన ఆసియా శక్తిగా భారత్‌ ఇంకా నటిస్తుండటం పట్ల అది అసంతృప్తితో ఉంది. వాస్తవానికి, చైనా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకం (బీఆర్‌ఐ) సదస్సును బహిష్కరించిన ఏకైక దేశం భారత్‌ మాత్రమే. భార త్‌తో కలసి చతుర్ముఖ కూటమిగా వ్యవహరిస్తున్న అమెరికా, జపాన్, ఆస్ట్రేలి యాలు సైతం ఆ చర్చలకు హాజరయ్యాయి. రెండు, అది ఈ అసంతృప్తిని బహిరంగంగా కాకున్నా, తన బంటు పాకిస్తా¯Œ  ద్వారా వ్యక్తం చేస్తూనే ఉంది. మూడవది ముఖ్యమైనది, వారు పంపుతున్న పెద్ద సందేశం. అది మరింత  తలబిరుసుతనంతో కూడినది: చాలా తొందరగా మీకు మీరు ఒక పెద్ద శక్తిగా ప్రకటించేసుకున్నారు. కానీ మీరు మా సరసన నిలవగలవారు కారు. మీ ఆర్థిక వ్యవస్థ, సైన్యమూ కూడా చిన్నవి, పైగా పట్టించుకోకుండా వదిలేసిన పలు దీర్ఘకాలిక సమస్యలు కూడా మీకు ఉండి ఉండవచ్చు.

మన కీలక బలహీనత ఏది?
జపాన్‌–అమెరికా–భారత్‌ కూటమి బలపడటం చైనాకు చికాకు కలి గించడం అర్థం చేసుకోగలిగిందే. వారం పాటూ మలబార్‌ తీరంలో జరిగిన త్రైపాక్షిక నావికా విన్యాసాల తదుపరి ఈ సంపాదకీయం వెలువడింది. చైనాతో సంఘర్షణే జరిగితే జపాన్, అమెరికాలు భారత్‌కు మద్దతుగా నిలుస్తాయని భారత్‌ భ్రమిస్తోందని, వాటి  సహాయం ‘మిథ్యే’ అని అది పేర్కొంది. ఆ తదుపరి ‘‘హిందూ మహా సముద్రంలో ప్రయోగించడానికి తనకొక వ్యూహాత్మకమైన అస్త్రం ఉన్నదని భారత్‌ ఊహిస్తుంటే అది మరింత అమాయకత్వం. భారత్‌కున్న ప్రాణాంతక  బలహీనతను దెబ్బ తీయగల పలు అస్త్రాలు చైనాకు ఉన్నాయి. చైనాతో వ్యూహాత్మకంగా తాడో పేడో తేల్చుకోడానికి తగిన సామర్థ్యం భారత్‌కు లేనే లేదు’’ ఈ ప్రకటనలోని అత్యంత ముఖ్యమైన వాక్యం ఆ తదుపరిదేనని నాకు తోస్తోంది.

చైనా తన దౌత్య, వ్యూహాత్మక సందేశాన్ని పంపడానికి  ప్రభుత్వ మీడి యాను వాడుకుంటుంది. కాబట్టి అది జాగ్రత్తగా ఆచి తూచి పద ప్రయోగం చేయడంలో ఆరితేరినది. కానీ అది ప్రదర్శించిన తలపొగురుతనం వల్ల నిరక్ష్యంగా నోరు జారి తన మనసులో ఏముందో లేదా వ్యూహం ఏమిటో బయట పెట్టేసి ఉండొచ్చు కూడా. భారత్‌కు ఉన్న కీలక బలహీనతను గురించి అది ప్రస్తావించడమే అందుకు ఉదాహరణ. ఇది ఆగ్రహంతో వ్యూహా త్మకంగా ప్రదర్శించిన నిర్లక్ష్యం. అది, భారత్‌ మేలుకోవాలని చేసే హెచ్చరిక అయింది. అంటే చైనా, వాస్తవాధీన రేఖ భగ్గుమనేలా, కశ్మీర్‌ లోయలో హింస మరింత పెరిగేలా చేయడానికి పాకిస్తాన్‌ను ఉసిగొలుపుతుందని అర్థమా? అందులో కొంత వరకు ఇప్పటికే జరుగుతోంది. ఇతర భారత సరిహద్దుల్లో, ప్రత్యేకించి నేపాల్‌ సరిహద్దుల్లో కొత్త ఉద్రిక్తతలను అది రేకెత్తిస్తుందని అర్థమా? నేటి మన నేపాల్‌ విధానం ఎంత గందరగోళంగా ఉన్నదో చూస్తే, చైనా ఆ పనిని తనకు ఇష్టమొచ్చినçప్పుడు ఎప్పుడైనా చేయగలదు. తూర్పు– మధ్య భారతం(మావోయిస్టు)లో, ఈశాన్యంలో తిరుగుబాట్లను రేకెత్తిస్తుం దని అర్థమా? ప్రత్యేకించి నాగాలాండ్, అరుణాచల్‌/అస్సాంలో ఇప్పటికే తిరుబాట్లు రాజుకుంటున్నాయి.

ఇవన్నీ చైనా సందేశానికి అర్థమా?
లేదంటే అది అంతకు మించినదా? నేడు ఉద్రిక్తతలు రాజుకుంటున్న ప్రాంతానికి సమీపంలో సిక్కింకు ఆనుకుని ఉన్న డార్జిలింగ్‌ వారాల తరబడి జాతి–భాషాపరమైన హింసతో భగ్గుమంటోంది. డార్జిలింగ్‌ను పాలిస్తున్న పశ్చిమ బెంగాల్‌ మత కల్లోలంతో అట్టుడుకుతోంది. దాన్ని వాస్తవం కంటే ఎక్కువగా అతిశయీకరిస్తున్నారు. కానీ ఇలాంటి పరిస్థితులు తేలికగా చేయి దాటిపోవడం సర్వసాధారణం. డార్జిలింగ్‌కు, రాష్ట్రంలోని కొన్ని సున్నిత మైన జిల్లాలకు ఇటీవలి కొన్ని వారాల్లో సైన్యాన్ని పిలవాల్సి రావడం గమనార్హం.  

వీటన్నిటి మధ్య నాగాలాండ్‌ ప్రభుత్వం పడిపోయి, కొత్త (బీజేపీకి మరింత అనుకూలంగా ఉండే) ప్రభుత్వం గవర్నర్‌ అండతో అధికారంలోకి వచ్చింది. ఇది అక్కడ తెగల మధ్య ఉండే సున్నితమైన అధికార సమతూకాన్ని అస్థిరపరచింది. పైగా శాంతి చర్చలు నిలిచిపోవడానికి, శాంతిని వ్యతిరేకించే గ్రూపులు బలపడటానికి దారితీసింది. ఇదే వారంలో, త్రిపురలో ఆదివాసులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ జాతీయ ర హదారిని దిగ్బంధించారు. డోక్లామ్‌లో చైనా సేనల ఉనికికి సంబంధించి భారత్‌ ఆందోళనకు ప్రధాన కేంద్రం... దానివల్ల సిలిగురి కారిడార్‌కు కలుగుతున్న ముప్పే. అలాంటి పరిస్థితుల్లో దానిని ఆనుకుని ఉన్న జిల్లాలన్నీ, ఈశాన్యంలోని చాలా భాగం అట్టుడుకు తుండటం జాతి ప్రయోజనాలను పరిరక్షించే పరిణామమేనా?

అత్యాశ వీడండి
తూర్పు–మధ్య భారతంలోని మావోయిస్టుల సమస్య చైనాకు కొంత అనుకూలమైనదే. అయినా వారు చాలా బలహీనపడిపోయారు. పాకిస్తాన్‌ మిత్రులు కశ్మీర్‌ హింసను విస్తరింపజేయడం కొనసాగవచ్చు. అయినా ఇవేవీ మన  దేశ కీలక బలహీన త కాకపోవచ్చు. అది, డొక్లామ్‌కు సమీపంగా సిలిగురి కారిడార్‌కు ఆనుకుని అర్థ చంద్రాకారంలో... పశ్చిమ బెంగాల్‌ జిల్లాల నుంచి తూర్పున బలహీనమైన సరిహద్దులున్న ఈశాన్యం వరకు విస్తరించిన ప్రాంతం. మీ మెడ మీది పెద్ద నరమే (జగ్లార్‌) మీ ప్రధాన బలహీనతగా ఉన్న ఈ పరిస్థితిని ఎలా అభివర్ణించాలి? వ్యూహాత్మకమైన ఈ పీడకలనే చైనా అనుద్దేశపూర్వకంగా గుర్తుచేసింది.

కశ్మీర్, వాస్తవాధీనరేఖల వెంబడి శాంతిని నెలకొల్పడంలో స్పష్టంగానే మనకు పరిమితులున్నాయి. ఆదివాసి మావోయిస్టులు ఓ తలనొప్పి మాత్రమే. అయినా వారిని హడావుడిగా తుడిచిపెట్టేయలేం. అయినా వాళ్లు వ్యూహాత్మకంగా ప్రతికూలమైన అంశం కావడానికి చాలా దూరంలో ఉన్నారు. కానీ పశ్చిమ బెంగాల్, ఈశాన్యం పూర్తిగా భిన్నమైనవి. ప్రత్యేకించి నేడు నెలకొన్న అనేక సంక్షోభాలు స్వయంగా సృష్టించుకున్నవి. వాస్తవానికి అవి, సంప్రదాయకంగా తాము అసలు లెక్కలోకేరాని ప్రాంతాన్ని రాజ కీయంగా జయించడం కోసం బీజేపీ నిర్విరామంగా చేస్తున్న కృషి çఫలితాలు.

అది బీజేపీ సృష్టించిన రంధ్రం, దాన్ని అది మూసేయగలదు కూడా. రాజకీయాలు ఎన్నటికీ మన జీవితాలలో లేకుండా పోవు. అయినా ప్రధాని నరేంద్ర మోదీ అంతటి శక్తిని, అధికారాన్ని కలిగిన నేత... అంతర్గతమైన ఈ సంఘర్షణలను నిలిపివేయాలని దృఢంగా ఆదేశించగలుగుతాడు. నాగాలాం డ్‌లోని నేటి రాజకీయ అస్థిరత, డార్జిలింగ్‌లోని ఆందోళన నుంచి... దిగ్భ్రాం   తికరంగా ఈశాన్యంలోకెల్లా శాంతియుతమైనదిగా ఉంటున్న త్రిపురలో ఆది వాసులు తిరుగుబాటుకు దిగడం వరకు అన్నిటిలోనూ ఆయన  పార్టీ రాజ కీయ హస్తమే కనిపిస్తోంది. ఆయన అక్కడి జోక్యందారి గవర్నర్లను, ఆర్‌ఎస్‌ ఎస్‌ కమాండోలను, ప్రత్యేక బలగాలను  కనీసం తాత్కాలికంగానైనా వెనక్కు పిలవాలి. మనకంటే మరింత బలమైన శత్రువు దేశం ముంగిట నిలుచు న్నాడు. మీరే స్వయంగా సృష్టించిన బలహీనతలను శత్రువు మీకు గుర్తు చేశాడు కూడా. తలబిరుసుతనంతో శత్రువు చేసిన ఆ బుద్ధిమాలిన పనిని వాడుకుని ఇంటిని చక్కబెట్టుకోండి. ఈశాన్యాన్ని జయించే పార్టీ కార్య క్రమాన్ని తర్వాత తిరిగి మొదలెట్టవచ్చు.

twitter@shekargupta

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement