ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్టు
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్టు
Published Thu, Jun 29 2017 3:07 AM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM
రూ. 6 లక్షల విలువైన బంగారు సొత్తు స్వాధీనం
కాకినాడ క్రైం: మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలను మూడేళ్లుగా తెంచుకుపోతున్న ఇద్దరు చైన్ స్నాచర్లను ఎట్టకేలకు కాకినాడ టూ టౌన్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ. 6 లక్షల విలువైన 196.8 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను కాకినాడ క్రైం డీఎస్పీ ఏ. పల్లపురాజు బుధవారం కాకినాడ త్రీ టౌన్ క్రైం పోలీసుస్టేçషన్లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాకినాడ బ్యాంకుపేట గంగాలమ్మగుడివీధి, అబుద్‌నగర్‌కు చెందిన మేడిచర్ల శ్రీను (32) ఆటో డ్రైవర్. చెడు వ్యసనాలకు బానిసైన ఇతను కాకినాడ టూ టౌన్, సర్పవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో 2015, 2016, 2017 సంవత్సరాల్లో నాలుగు చోట్ల మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలను అపహరించుకుపోయాడు. అతనితో పాటు స్థానిక అన్నమ్మఘాటీ కుంతీదేవిపేట, నరసింహరోడ్డుకు చెందిన వల్లూరి ఆషీష్‌కుమార్ (23) 2017లో రెండు చైన్‌స్నాచింగ్ దొంగతనాల్లో పాల్గొన్నాడు. ఇతనికి సొంతంగా లారీ ఉన్నప్పటికీ సరైన కిరాయిలు రాకపోవడం, నెలవారీ ఫైనాన్స్‌లు కంపెనీకి చెల్లించకపోవడంతో చైన్‌స్నాచింగ్‌కు దిగాడు. ఇద్దరూ మోటారు సైకిల్‌పై వచ్చి రోడ్లపై నడచి వెళుతున్న మహిళల మెడలోని బంగారు వస్తువులను తెంచుకుని పారిపోయేవారు. నిందితులు ఇద్దరిపై కాకినాడ టూ టౌన్ పరిధిలో రెండు, సర్పవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో 2 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు డీఎస్పీ పల్లపురాజు ఆధ్వర్యంలో కాకినాడ వన్, టూ, త్రీ టౌన్ క్రైం ఎస్సైలు, డీఎస్పీ క్రైం పార్టీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. గాలింపు చర్యల్లో వారు కాకినాడ గంగాలమ్మతల్లి గడి వీధి, బ్యాంకుపేటలో డోర్ నంబర్ 19–5–10 ఇంట్లో ఉన్నట్టు గుర్తించి దాడి చేసి మేడిచర్ల శ్రీను, వల్లూరి ఆషీష్‌కుమార్‌లను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వాటిలో ఇటీవల కాకినాడ నాగమల్లితోట ద్వారంపూడి ఫంక్షన్ హాలు సమీపంలో జరిగిన చైన్‌స్నాచింగ్ కేసులో బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ పల్లపురాజు తెలిపారు. నిందితుల నుంచి నాలుగు కేసులకు సంబంధించిన రూ. 6 లక్షల విలువైన 196.8 గ్రాముల బంగారు ఆభరణాలను, చైన్‌స్నాచింగ్‌కు వినియోగించిన బజాజ్ పల్సర్ మోటార్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన క్రైం ఎస్సైలు, క్రైం పార్టీ సిబ్బందిని ఆయన అభినందించారు. క్రైం ఎస్సై రామారావు, సుధాకర్, డిటెక్టివ్ పార్టీ హెచ్‌సీ కొప్పిశెట్టి గోవిందరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement