ఒంటరిగా ఉండగా.. | chain snaching in ckpalli | Sakshi
Sakshi News home page

ఒంటరిగా ఉండగా..

Published Wed, Oct 19 2016 12:09 AM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM

chain snaching in ckpalli

♦ ఇంట్లోకి చొరబడిన దొంగ
♦కత్తితో బెదిరించి, ఆపై 
చెంప ఛెళ్లుమనిపించి...
♦మెడలోని బంగారు చైన్‌తో 
ఉడాయింపు
చెన్నేకొత్తపల్లి : స్థానిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసే రాజారెడ్డి భార్య సావిత్రమ్మ మెడలోని బంగారు చైన్‌ను మంగళవారం ఓ దుండగుడు బలవంతంగా లాక్కెళ్లాడు. భర్త సరుకులు తెచ్చేం దుకు బజారుకెళ్లగా సావిత్రమ్మ ఇంట్లో టీవీ చూస్తూ, కుమారుడితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో గుర్తు తెలియని యువకుడు ఇంటి తలుపులు తెరచుకుని లోనికి ప్రవేశించాడు. వెనుక నుంచి వెళ్లి ఆమె చెవులను గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. ఆ తరువాత ఆమె చెంపలపై బలవంతగా కొట్టాడు.
 
దీంతో బిత్తరపోయిన ఆమె ఏం జరుగుతోందో అర్థం కాక అదోలా చూస్తుండిపోయారు. ఇదే అదనుగా అతను ఆమె మెడలోని చైన్‌ను బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. ఆ తరువాత తేరుకున్న ఆమె దొంగ.. దొంగ.. అంటూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకునేలోపే అతను మాయమయ్యాడు. లాక్కెళ్లిన చైను 5 తులాలు ఉందని, దాని విలువ దాదాపు రూ.1.50 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపారు. దొంగ తన వెంట తెచ్చుకున్న చాకును సైతం ఇంట్లోనే పడేసి వెళ్లిపోయాడన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీ తమ సిబ్బందితో బాధితురాలి ఇంటికి చేరుకున్నారు. ఘటనపై ఆరా తీశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement