గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అల్వాల్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.15 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు
గొలుసు దొంగల అరెస్టు
Sep 18 2013 1:46 AM | Updated on Aug 28 2018 7:30 PM
అల్వాల్,న్యూస్‌లైన్: గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అల్వాల్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.15 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి డీసీపీ శివకుమార్ వివరాల ప్రకారం..బాలాజీనగర్‌లోని హనుమాన్‌మందిరం వద్ద మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా,అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నేరాల చిట్టా బయటపెట్టారు. మల్కాజిగిరి యాదవ్‌నగర్‌కు చెందిన కుక్కుట్ల నారాయణ అలియాస్ చిన్నా(25), 2008లో దొంగతనానికి పాల్పడి జైలుకెళ్లి విడుదలైన అనంతరం సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన బి.శివకుమార్ అలియాస్ శివ(21), సికింద్రాబాద్ సినిమా థియేటర్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తే ఆరేపల్లి రాజశేఖర్(21), మాణికేశ్వరినగర్‌కు చెందిన కె.శ్యాంసుందర్(22)లు ముఠాగా ఏర్పడ్డారు. వీరు అల్వాల్, కీసర, నేరేడ్‌మెట్, ఉప్పల్, కుషాయిగూడ పోలీసుస్టేషన్ల పరిధుల్లో మూడు ఆటోలు, 17 గొలుసు దొంగతనాలకు పాల్పడి 32 తులాల ఆభరణాలు అపహరించారు. మరో ఘటనలో: యాప్రాల్ కిందిబస్తీకి చెందిన ఎన్.రాజు (21) నిలిపివున్న ద్విచక్రవాహనాలను మారు తాళం చెవులతో దొంగిలించి విక్రయించేవాడు. నాగరాజును అరెస్టు చేసి అతడ్నించి మూడు ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Advertisement