కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంటలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారుల్లో ఒంటరిగా పొలం పనులు చేసుకుంటున్న మహిళను దుండగుడు కత్తితో బెదిరించాడు. మెడలోని గొలుసు ఇవ్వకుంటే చంపేస్తానని అన్నాడు. దాంతో బయపడిన మహిళ మెడలోని రెండు తులాల గొలుసును దుండగుడికి ఇచ్చేసింది.
ఆ గొలుసును తీసుకుని దుండగుడు బైక్పై పరారైయ్యాడు. దాంతో మహిళ బిగ్గరగా అరవడంతో స్థానికులు వెంటనే ఆమె వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకుని... పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అందులోభాగంగా నిందితుడి వివరాలను బాధితురాలిని అడిగి తెలుసుకుంటున్నారు.