గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు.
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. బైక్‌పై వచ్చిన అగంతకులు ఓ యువతి మెడలో బంగారు గొలుసును తెంపుకుపోయారు. గురువారం ఉదయం మెయిన్ బజార్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.