మంత్రి ట్రిప్ట్ రజీందర్ సింగ్ బజ్వా (ఫైల్ ఫోటో)
సాక్షి, చండీగఢ్: పంజాబ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ట్రిప్ట్ రజీందర్ సింగ్ బజ్వా (77) భార్య రత్నేశ్వర్ కౌర్,కుమారుడు కూడా కరోనా బారిన పడ్డారు. మంత్రికి కోవిడ్-19 సోకిన రెండు రోజుల తరువాత, నిర్వహించిన పరీక్షల్లో ఆయన భార్య, కొడుకు కూడా కరోనా వైరస్ వ్యాధి సోకినట్టు గురువారం గుర్తించారు. ఈ విషయాన్ని కోవిడ్-19 నోడల్ అధికారి డాక్టర్ రాజేష్ భాస్కర్ ధృవీకరించారు. ఇద్దరికి పెద్దగా వైరస్ లక్షణాలు లేనప్పటికీ , క్వారంటైన్ చేసినట్టు వెల్లడించారు.
జూలై 9న గ్రామీణాభివృద్ధి శాఖ సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి బాజ్వాకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తోపాటు, మంత్రులు సుఖ్జిందర్ సింగ్ రాంధావా, అరుణ చౌదరికి, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పర్మిందర్ పింకీ, కుల్బీర్ జీరా, బరిందర్‌మీత్ సింగ్ పహ్రా లకు కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోగా నెగటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా పంజాబ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,799 కరోనా కేసులు నమోదు కాగా 221 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment