‘నా కళ్లు చిన్నగా ఉండొచ్చు.. కానీ’.. మరోమారు వార్తల్లోకి ఆ మంత్రి | Nagaland Minister Temjen Imna Along Humour Yet Again Wins Internet | Sakshi
Sakshi News home page

‘చిన్న కళ్లు’ వ్యాఖ్యలతో మరోమారు వార్తల్లోకి నాగాలాండ్‌ మంత్రి

Published Mon, Oct 10 2022 11:02 AM | Last Updated on Mon, Oct 10 2022 11:02 AM

Nagaland Minister Temjen Imna Along Humour Yet Again Wins Internet - Sakshi

కోహిమా: పరిస్థితులు ఎలా ఉన్నా సందర్భానుసారం నవ్వులు పూయించటంలో కొందరు నిష్ణాతులుంటారు. అలాంటి వారిలో నాగాలాండ్‌ మంత్రి టెమ్‌జెన్‌ ఇమ్నా అలోంగ్‌ ఒకరు అని చెప్పకతప్పదు. తనలాగే ఒంటరిగా ఉండండంటూ జనాభా పెరుగుదలపై చమత్కారమైన సలహా ఇచ్చి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారు. అంతకు ముందు ఈశాన్య ప్రజలకు చిన్నకళ్లు ఉంటాయని జాత్యాహంకార వ్యాఖ్యలపైనా తనదైన శైలీలో సమాధానమిచ్చి వార్తల్లో నిలిచారు మంత్రి టెమ్‌జెన్‌. తాజాగా మరోమారు ‘చిన్న కళ్లు’ వ్యాఖ్యలతో వైరల్‌గా మారారు. 

తాజాగా తన ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు మంత్రి టెమ్‌జెన్‌. తాను ఎల్లప్పుడూ ఫోటో పోజులకు రెడీ అని పేర్కొన్నారు. తనకు ఉన్న చిన్న కళ్లతోనే మైల్‌ దూరంలో ఉన్న కెమెరాలను గుర్తించగలనని చమత్కరించారు. ‘నా కళ్లు చిన్నగా ఉండొచ్చు.. కానీ, ఒక మైల్‌ దూరం నుంచి నేను కెమెరాను చూస్తాను. ఎల్లప్పుడూ పోజ్‌కు రెడీ. ఇది చదువుతున్నప్పుడు మీ పెదాలపై చిరునవ్వును చూస్తాను.’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆదివారం ఉదయం ఫోటో షేర్‌ చేయగా కొన్ని గంటల్లోనే ఐదు వేల వరకు లైకులు, వందల కొద్ది కామెంట్లు వచ్చాయి. లాఫింగ్‌ ఎమోజీలతో కామెంట్‌ సెక్షన్‌ నిండిపోయింది. మీరు మమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచుతారనే దాంట్లో ఎలాంటి సందేశం లేదు అంటూ ఓ నెటిజన్‌ రాసుకొచ్చారు. దేశంలోనే అత్యంత వినోదభరితమైన మంత్రిగా మరొకరు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బార్కొలానా వీక్‌.. సముద్రంపై ‘తెరచాప’ పడవల పందెం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement