small eye
-
‘నా కళ్లు చిన్నగా ఉండొచ్చు.. కానీ’.. మరోమారు వార్తల్లోకి ఆ మంత్రి
కోహిమా: పరిస్థితులు ఎలా ఉన్నా సందర్భానుసారం నవ్వులు పూయించటంలో కొందరు నిష్ణాతులుంటారు. అలాంటి వారిలో నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ఒకరు అని చెప్పకతప్పదు. తనలాగే ఒంటరిగా ఉండండంటూ జనాభా పెరుగుదలపై చమత్కారమైన సలహా ఇచ్చి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారు. అంతకు ముందు ఈశాన్య ప్రజలకు చిన్నకళ్లు ఉంటాయని జాత్యాహంకార వ్యాఖ్యలపైనా తనదైన శైలీలో సమాధానమిచ్చి వార్తల్లో నిలిచారు మంత్రి టెమ్జెన్. తాజాగా మరోమారు ‘చిన్న కళ్లు’ వ్యాఖ్యలతో వైరల్‌గా మారారు. తాజాగా తన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు మంత్రి టెమ్జెన్. తాను ఎల్లప్పుడూ ఫోటో పోజులకు రెడీ అని పేర్కొన్నారు. తనకు ఉన్న చిన్న కళ్లతోనే మైల్ దూరంలో ఉన్న కెమెరాలను గుర్తించగలనని చమత్కరించారు. ‘నా కళ్లు చిన్నగా ఉండొచ్చు.. కానీ, ఒక మైల్ దూరం నుంచి నేను కెమెరాను చూస్తాను. ఎల్లప్పుడూ పోజ్‌కు రెడీ. ఇది చదువుతున్నప్పుడు మీ పెదాలపై చిరునవ్వును చూస్తాను.’ అంటూ ట్వీట్ చేశారు. ఆదివారం ఉదయం ఫోటో షేర్ చేయగా కొన్ని గంటల్లోనే ఐదు వేల వరకు లైకులు, వందల కొద్ది కామెంట్లు వచ్చాయి. లాఫింగ్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. మీరు మమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచుతారనే దాంట్లో ఎలాంటి సందేశం లేదు అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. దేశంలోనే అత్యంత వినోదభరితమైన మంత్రిగా మరొకరు పేర్కొన్నారు. My eyes may be small, but I can see the camera from a mile. Always pose ready. 📸 Also I can see you smile as you reading it! 😉 Good Morning pic.twitter.com/7ntWw5UMVx — Temjen Imna Along (@AlongImna) October 9, 2022 ఇదీ చదవండి: బార్కొలానా వీక్.. సముద్రంపై ‘తెరచాప’ పడవల పందెం -
మాదిగలపై కేంద్రం కపట ప్రేమ
ఐదోరోజుకు టీఎస్ ఎమ్మార్పీఎస్ రిలేదీక్షలు ముకరంపుర : అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కాలయాపన చేస్తూ కేంద్ర ప్రభుత్వం మాదిగలపై కపట ప్రేమ చూపిస్తుందని టీఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి బొడ్డు రామన్న అన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలేనిరాహార దీక్షలు సోమవారానికి ఐదో రోజుకు చేరాయి. ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేపడతామని ఇచ్చిన హామీని బీజేపీ ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. మహిళా జిల్లా అధ్యక్షురాలు జింక భాగ్య, ఎంవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుంకె సంపత్, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కోడెపాక సారంగం, జిల్లా ప్రధాన కార్యదర్శి తునికి వసంత్, తిమ్మాపూర్ మండలాధ్యక్షుడు సముద్రాల రమేశ్, వీణవంక అధ్యక్షుడు జీడి లక్ష్మణ్, జమ్మికుంట అధ్యక్షుడు రేణుకుంట్ల కుమార్, చొప్పదండి ఇన్చార్జి భద్రకంటి చంద్రన్న, నాయకులు ద్యావ అంజన్న, శనిగరపు మధు, శ్రీనివాస్, కుమార్ పాల్గొన్నారు.