రిలే దీక్షలో ఎమ్మార్పీఎస్ నాయకులు
-
ఐదోరోజుకు టీఎస్ ఎమ్మార్పీఎస్ రిలేదీక్షలు
ముకరంపుర : అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కాలయాపన చేస్తూ కేంద్ర ప్రభుత్వం మాదిగలపై కపట ప్రేమ చూపిస్తుందని టీఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి బొడ్డు రామన్న అన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలేనిరాహార దీక్షలు సోమవారానికి ఐదో రోజుకు చేరాయి. ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేపడతామని ఇచ్చిన హామీని బీజేపీ ప్రభుత్వం మరిచిపోయిందన్నారు.
మహిళా జిల్లా అధ్యక్షురాలు జింక భాగ్య, ఎంవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుంకె సంపత్, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కోడెపాక సారంగం, జిల్లా ప్రధాన కార్యదర్శి తునికి వసంత్, తిమ్మాపూర్ మండలాధ్యక్షుడు సముద్రాల రమేశ్, వీణవంక అధ్యక్షుడు జీడి లక్ష్మణ్, జమ్మికుంట అధ్యక్షుడు రేణుకుంట్ల కుమార్, చొప్పదండి ఇన్‌చార్జి భద్రకంటి చంద్రన్న, నాయకులు ద్యావ అంజన్న, శనిగరపు మధు, శ్రీనివాస్, కుమార్ పాల్గొన్నారు.