![Minister Padmini Dian Met with An Accident - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/8/ORISSA.jpg.webp?itok=F2wG4r-1)
జయపురం : రాష్ట్ర జౌళి పరిశ్రమల శాఖ మంత్రి పద్మినీ దియాన్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కొరాపుట్‌లో ఆదివారం ఉదయం ఓ సమావేశానికి హాజరైన ఆమె తన కారులో తిరిగి కొట్‌పాడ్ వైపు వెళ్తుండగా, ఆమె కారుకి ఎదురుగా వస్తున్న మోటార్‌బైక్ కారుని బలంగా ఢీకొట్టింది. దీంతో మంత్రి కారు ముందు భాగం కొంత ధ్వంసం కాగా, కారు డ్రైవరుకి స్వల్ప గాయాలయ్యాయి. అయితే మోటారుబైక్‌పై వస్తున్న బినోదకుమార్ పండాకి మాత్రం తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వైద్యసేవల నిమిత్తం బొరిగుమ్మ హాస్పిటల్‌కి క్షతగాత్రులను తరలించారు. మంత్రి సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment