కేసీఆర్ వ్యాఖ్యలు అసమంజం: కోండ్రు | Minister Kondru Murali fire on KCR comments | Sakshi
Sakshi News home page

కేసీఆర్ వ్యాఖ్యలు అసమంజం: కోండ్రు

Published Sat, Aug 10 2013 1:37 PM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

కేసీఆర్ వ్యాఖ్యలు అసమంజం: కోండ్రు - Sakshi

కేసీఆర్ వ్యాఖ్యలు అసమంజం: కోండ్రు

హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై మంత్రి కోండ్రు మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేసీఆర్ వ్యాఖ్యలు అసమంజంగా ఉన్నాయని కోండ్రు మండిపడ్డారు. కొందరు తెలంగాణనేతలు సీమాంధ్ర ప్రజలను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన శనివారమిక్కడ అన్నారు. కోమటిరెడ్డి, పొన్నం వంటివారి వ్యాఖ్యలు గర్హనీయమని, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తన స్థాయిని దిగజార్చుకునేలా మాట్లాడుతున్నరని కోండ్రు వ్యాఖ్యానించారు.

మరోమంత్రి బాలరాజు మాట్లాడుతూ ముందు చూపున్న నేతగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి వాస్తవాలే మాట్లాడారని  అన్నారు.  సీఎం అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. సీఎం వ్యాఖ్యలను కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం వక్రీకరిస్తున్నారని అన్నారు. కాగా రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను సమర్థించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement