
ఏ నిమిషంలోనైనా విభజన ఆగిపోవచ్చు: కొండ్రు మురళి
శ్రీకాకుళం: ఏ నిమిషంలోనైనా రాష్ట్ర విభజన ఆగిపోవచ్చని మంత్రి కొండ్రు మురళి ఆశాభావం వ్యక్తం చేశారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు సీమాంధ్రకు ప్యాకేజీలు ఏమీ కోరలేదని చెప్పారు. సమైక్యరాష్ట్రం కోసం తమ పోరాటం కొనసాగిస్తామని మంత్రి అన్నారు.
ఒక పక్క కేంద్రం దూకుడు మీద విభజన చర్యలు చేపడుతుంటే, మంత్రులు తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతన్నారు. ఈ విధంగా రోజుకో రకంగా మంత్రులు మాట్లాడి ప్రజలను ఆయోమయానికి గురిచేస్తున్నారు.