
దళితులకు నీవు చేసిందేమిటి?
విశాఖపట్నం: మంత్రి కోండ్రు మురళికి చేదు అనుభవం ఎదురైంది. విశాఖలో సోమవారం కేంద్రమంత్రి జైరాం రమేష్ దళిత సంఘాలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కోండ్రు ప్రసంగిస్తుండగా దళిత సంఘాల సమాఖ్య ప్రతినిధులు అడ్డుకున్నారు. దళితులకు నీవు చేసిందేమిటి? దళిత మంత్రివైన్పటికీ సొంత నియోజకవర్గం దళితులకు ఏమి చేశావ్? అని నిలదీశారు.
శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేట ఘటనలో ఆరుగురు దళితులు చనిపోయారు వారికి ఏం న్యాయం చేశావా? అంటూ ఆగ్రహంతో ప్రశ్నించడంతో సమావేశం రసాభాసగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని శాంతింపజేశారు. సమావేశం అనంతరం బయటకు వచ్చాక కూడా వారు మంత్రితో వాగ్వాదానికి దిగారు.