కాంగ్రెస్‌కు గుడ్‌బై
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు గుడ్‌బై చెబుతున్నారు. గురువారం హొంజరాంలో సమావేశమైన నేతలు, కార్యకర్తలు మాజీ మంత్రి కోండ్రు మురళిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు వెల్లడించిన వారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నామని ప్రకటించారు.
వీరఘట్టం, న్యూస్‌లైన్: పాలకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వీరఘట్టం మండలం క్యాడర్ మొత్తం టాటా... బైబై చెప్పేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే సుగ్రీవులకు ఇక్కడ మంచి ఆదరణ ఉండేది. రాష్ర్ట విభజనకు ప్రధాన కారణమైన పార్టీలో కొనసాగేందుకు సిగ్గుపడుతూ ఒక్కొక్కరు భవిష్యత్‌ను వెతుక్కుంటున్నారు. 2005లో జరిగిన స్థానిక ఎన్నికల సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున సిఫార్సులు, లాబీయింగ్‌లు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యూ కట్టేవారు. ఇప్పుడు పిలిచి టిక్కెట్లు ఇస్తామన్నా తీసుకొనేవారు కరువయ్యారు. దీంతో ఎమ్మెల్యేకు ఏమి చేయాలో తెలియడం లేదు. బుజ్జగింపులు చేస్తున్నా విభజన పాపం ఎవరిదంటూ కార్యకర్తలు నిలదీస్తుండడంతో ఎమ్మెల్యే తెల్లమొహం వేస్తున్నారు.