కాంగ్రెస్ ఎంపీలు సోనియా పెంపుడు కుక్కలు
కాంగ్రెస్ ఎంపీలు సోనియా పెంపుడు కుక్కలు
Published Sun, Sep 8 2013 2:23 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ ఎంపీలు, సోనియా గాంధీ ఇంటివద్ద పెంపుడు కుక్కల్లా వ్యవహరిస్తున్నారని, ఒకరికి మంత్రి పదవి, మరొకరికి ప్రాజెక్టులు ఇవ్వగా వాటిని పట్టుకుని వేళ్లాడుతున్నారని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించా రు. తెలుగు జాతి ఆత్మగౌరవయాత్రలో భాగంగా చంద్రబాబు శనివారం కృష్ణా జిల్లా గన్నవరం, ఆగిరి పల్లి, నూజివీడు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ అసమర్దుడని, ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకుంటాడని, లీకువీరుడని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స ఉత్సవ విగ్రహమని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారని ఆరోపించారు.
విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలు రోడ్లపైకి వచ్చినా వారి సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని, తెలుగుజాతిని విభజించేందుకే యత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలు వస్తే తెలంగాణాలో టీఆర్‌ఎస్, సీమాంధ్ర లో జగన్ గెలుస్తారని కాంగ్రెస్ భావిస్తోందని, త ర్వాత ఆ పార్టీని తమ పార్టీలో విలీనం చేసుకొని పబ్బం గడుపుకోవచ్చంటూ కాంగ్రెస్ ఆడిన బొమ్మ, బొరుసు ఎత్తుగడే విభజనని చంద్రబాబు అన్నారు. దీన్ని అడ్డుకునేందుకు తాను తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్రను చేపట్టానని చెప్పారు. రాష్ట్ర విభజనకు తాను లేఖ ఇచ్చానని, రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయూలని తాను చెప్పినా, ఒక ప్రాంతానికి అన్యాయం జరిగే ట్లు నిర్ణయాలు తీసుకుంటారా? అంటూ ప్రశ్నించారు. తెలుగుజాతిలో చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తే సోనియాగాంధీకి శృంగభగం తప్పదన్నారు. అంతకు ముందు గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలోని మహిళా పారిశ్రామికవాడలో మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. బాబుకు జేఏసీ నిరసన సెగ సమైక్యాంధ్రపై వైఖరిని స్పష్టం చేయకుండా చంద్రబాబు ఆత్మగౌరవయాత్రను నిర్వహిస్తున్నారంటూ నూజివీడు జేఏసీ శనివారం ఆయునకు నిరసన తెలిపింది. పండ్ల మార్కెట్ సెంటరులో ఆయున సమావేశం సాగుతున్నంతసేపూ, జేఏసీ శిబిరం వద్ద వారు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూనే ఉన్నారు.
Advertisement
Advertisement