
వైద్య పరీక్షల కోసం నేడు అమెరికాకు సోనియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లనున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు ఆదివారం చెప్పారు. వైద్య చికిత్స కోసం ఆమె సోమవారం సాయంత్రం అమెరికా వెళ్లనున్నట్లు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా, ఈ విషయం చెప్పిన పార్టీ నేత, మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. చికిత్స కోసం సోనియా అమెరికా బయలుదేరడం గత ఆరు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. 2011 ఆగస్టులో ఆమె అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. కాగా, లోక్‌సభలో ఆగస్టు 26న ఆహార బిల్లుపై ఓటింగు జరుగుతున్న సమయంలో అస్వస్థతకు గురైన సోనియా, ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే.