
కోల్‌కత్తా: జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొవడంలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. గడిచిన ఐదేళ్ల కాలంలో బీజేపీ వైఫల్యాలను కాంగ్రెస్ ప్రశ్నించలేకపోయిందని అన్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ కాంగ్రెస్‌కు రాదని, విపక్షాల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని మమత అభిప్రాయపడ్డారు. ఎన్నికల అనంతరం జాతీయ స్థాయిలో తృణమూల్ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టంచేశారు.
బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో అంతా భూటకమని, రామమందిర అంశం కేవలం ఎన్నికల్లో లబ్ధిపొందడం కొరకు మాత్రమే అని పేర్కొన్నారు. మమత ఆరోపణలపై బెంగాల్ కాంగ్రెస్ ఛీప్ సోమిన్ మిత్రా వెంటనే స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు మమత పరోక్షంగా సహకరిస్తున్నారని అన్నారు. కాగా సార్వత్రిక ఎన్నికలల్లో బీజేపీ, తృణమూల్, కాంగ్రెస్ హోరాహోరీగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. తొలి విడత ఎన్నికల్లో భాగంగా రెండు లోక్‌సభ స్థానాలకు రేపు ఎన్నికల జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment