కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు బుధవారం రూ. 5 లక్షల జరిమానా విధించింది. బెంగాల్ ఎన్నికల సందర్భంగా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌషిక్ చందాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తూ మమత గతంలో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారంటూ కోర్టు మమతకు జరిమానా విధించింది.
కాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి దాఖలు చేసిన దరఖాస్తును జస్టిస్ కౌషిక్ చందా స్వయంగా తిరస్కరించారు. ఈ కేసును తన వ్యక్తిగత అభీష్టానుసారం విచారించకూడదని నిర్ణయించుకున్నారు. ఈ కేసును తన బెంచ్ నుంచి తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment