కోలకతా: అంచనాలకనుగుణంగానే టీఎంసీ గూటికి మాజీ ఎంపీ సుస్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుస్మితా దేవ్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సుస్మితా దేవ్ టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఒబ్రెయిన్ సమక్షంలో సోమవారం టీఎంసీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు సుస్మితాతో పాటు, టీఎంసీ ట్విటర్ ఖాతాల ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు.
తన శక్తి సామర్థ్యాలను సంపూర్తిగా కేటాయిస్తానంటే ట్విట్ చేసిన సుస్మిత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు ఖేలా హోబ్ హ్యాష్ ట్యాగ్‌ను కూడా యాడ్ చేశారు.
కాగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి సుస్మితా దేవ్ లేఖ రాశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. పార్టీతో మూడు దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఆమె ఈ సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ నేతలు, సభ్యులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఎందుకు పార్టీని వీడుతున్నదీ ఆమె వెల్లడించలేదు. ప్రజా సేవలో మరో నూతన అధ్యాయం అని మాత్రమే వెల్లడించారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, ఈ వార్తలను కాంగ్రెస్ ఖండించింది. మరోవైపు ఇదే నిజమైతే చాలా దురదృష్టకరమంటూ కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ ట్వీట్ చేశారు.
Listen to @sushmitadevinc share her experience after meeting our National General Secretary @abhishekaitc & the Hon'ble Chief Minister of WB @MamataOfficial along with Parliamentary Party Leader RS @derekobrienmp.
— All India Trinamool Congress (@AITCofficial) August 16, 2021
She will address the Media in Delhi, tomorrow. Stay tuned! pic.twitter.com/LOUPyF7Ez7
Will give it all I have got…. @MamataOfficial thank you🙏🏻#KhelaHobe https://t.co/aa0ijNrhOk
— Sushmita Dev (@SushmitaDevAITC) August 16, 2021
If this is true it is most unfortunate
— Manish Tewari (@ManishTewari) August 16, 2021
Why @sushmitadevinc ?
Your erstwhile colleagues & friends especially the person who was National President of @nsui when you contested your first @DUSUofficial elections back in 1991 deserve a better explanation than this laconic letter? pic.twitter.com/0thBTVFCmY
Comments
Please login to add a commentAdd a comment