అభ్యర్థులను ‍ప్రకటించిన టీఎంసీ.. బరిలో మాజీ క్రికెటర్‌ | TMC Announces 42 Lok Sabha Candidates List in Bengal | Sakshi
Sakshi News home page

అభ్యర్థులను ‍ప్రకటించిన టీఎంసీ.. బరిలో మాజీ క్రికెటర్‌

Published Sun, Mar 10 2024 3:34 PM | Last Updated on Sun, Mar 10 2024 3:48 PM

TMC Announces 42 Lok Sabha Candidates List in Bengal - Sakshi

కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మెగా ర్యాలీలో 'మమతా బెనర్జీ' రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం 42 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. బహరంపూర్ నుంచి పార్టీ అభ్యర్థిగా టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ (Yusuf Pathan), కృష్ణానగర్ నుంచి మాజీ ఎంపీ మహువా మొయిత్రా బరిలో నిలిచారు.

మమత బెనర్జీ మేనల్లుడు, వారసుడు 'అభిషేక్ బెనర్జీ' డైమండ్ హార్బర్ నుంచి పోటీ చేయనున్నారు. నటుడు శత్రుఘ్న సిన్హా అసన్సోల్ నుంచి పోటీ చేయనున్నారు. అయితే సందేశ్‌ఖాలీ వివాదం కారణంగా 'నుస్రత్ జహాన్'ను బసిర్హాట్ స్థానం నుంచి తొలగించి.. ఆ స్థానంలో హాజీ నూరుల్ ఇస్లామ్‌ను బరిలోకి దింపారు.

తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల పూర్తి జాబితా

  • కూచ్‌బెహార్: జగదీష్ చంద్ర బసునియా
  • అలీపుర్దువార్: ప్రకాష్ చిక్ బరైక్
  • జల్పాయ్‌గురి: నిర్మల్ చంద్ర రాయ్
  • డార్జిలింగ్: గోపాల్ లామా
  • రాయ్‌గంజ్: కృష్ణ కళ్యాణి
  • బాలూర్ఘాట్: బిప్లబ్ మిత్ర
  • మాల్డా నార్త్: ప్రసూన్ బెనర్జీ
  • మాల్డా సౌత్: షానవాజ్ అలీ రెహాన్
  • జంగీపూర్: ఖలుయిలుర్ రెహమాన్
  • బెర్హంపూర్: యూసుఫ్ పఠాన్
  • ముర్షిదాబాద్: అబూ తాహెర్ ఖాన్
  • కృష్ణానగర్: మహువా మోయిత్రా
  • రణఘాట్: ముకుట్ మణి అధికారి
  • బొంగావ్: బిస్వజిత్ దాస్
  • బర్రా క్పూర్: పార్థ భౌమిక్
  • దుండం: సౌగత రాయ్
  • బరాసత్: కకోలి ఘోష్ దస్తిదార్
  • బసిర్హత్: హాజీ నూరుల్ ఇస్లాం
  • జాయ్‌నగర్: ప్రతిమ మండల్
  • మధురాపూర్: బాపి హల్దర్
  • డైమండ్ హార్బర్: అభిషేక్ బెనర్జీ
  • జాదవ్‌పూర్: సయోని ఘోష్
  • కోల్‌కతా సౌత్: మాలా రాయ్ డబ్ల్యూ
  • కోల్జాత నార్త్: సుదీప్ బంద్యోపాధ్య
  • హౌరా: ప్రసూన్ బెనర్జీ
  • ఉకుబెర్రా: సజ్దా అహ్మద్
  • సెరాంపూర్: కళ్యాణ్ బెనర్జీ
  • హుగ్లీ: రచనా బెనర్జీ
  • ఆరంబాగ్: మిటాలి బాగ్
  • తమ్లుక్: దేబాంగ్షు భట్టాచార్య
  • కాంతి: ఉత్తమ్ బారిక్
  • ఘటల్: దేవ్ దీపక్ అధికారి
  • ఝర్గ్రామ్: కలిపాడా సోరెన్
  • మిడ్నాపూర్: జూన్ మాలియా
  • పురూలియా: శాంతిరామ్ మహతో
  • బుర్ద్వాన్ వెస్ట్: అరూప్ చల్రనోర్తి
  • బర్డ్వాన్ ఈస్ట్: డాక్టర్ షర్మిలా సర్కార్
  • దుర్గాపూర్ బుర్ద్వాన్: కీర్తి ఆజాద్
  • అసన్సోల్: శత్రుఘ్న సిన్హా
  • బోల్పూర్: అసిత్ మాల్
  • బీర్భం: సతాబ్ది రాయ్
  • బిష్ణుపూర్: సుజాత మోండల్ ఖాన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement