సాక్షి, కోల్‌కతా : జూనియర్ డాక్టర్‌ల సమ్మె పట్ల మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ కూతురు షబ్బా హకీమ్ ఘాటైన విమర్శలు చేసింది. తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేస్తూ ‘ పనికి తగిన భద్రత కల్పించాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న వారి ఆందోళన’ సరైనదేనని, ఒక టీఎంసీ కార్యకర్తగా మా నాయకురాలి ప్రవర్తన పట్ల సిగ్గుపడుతున్నానని ఆమె పేర్కొన్నారు.
జూనియర్ వైద్యుడిపై దాడికి నిరసనగా నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న డాక్టర్లను వెంటనే విధుల్లో చేరాలని మమతా బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్లకు, ప్రభుత్వానికి మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో కోల్‌కతాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆరోగ్య, ప్రజా సంక్షేమ శాఖను నిర‍్వర్తించడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.
జాతీయ ఎన్నికల సందర్భంగా ఆసుపత్రుల్లో ఉన్న భద్రతను మమతా బెనర్జీ తొలగించిందని, దీన్ని వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆమె పేర్కొన్నారు .బీజేపీ, సీపీఎంతో లోపాయికార ఒప్పందం చేసుకొని హిందూ-ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని షబానా ఆరోపించారు. దీనంతటికి పరోక్షంగా బీజేపీ చీఫ్ అమిత్ షా సహకరిస్తున్నట్లు ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment