రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పశ్చిమ బెంగాల్‌పై వరాల జల్లు కురిపించారు. బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ఈవెంట్‌లో అంబానీ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ వృద్ధిని వేగవంతం చేయడంలో ఎంత మాత్రం వెనుకాడబోదని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు రూ. 45 వేల కోట్ల పెట్టుబడి పెట్టామని దీనికి అదనంగా రూ. 20వేల కోట్లు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నామని అంబానీ ప్రకటించారు.
రానున్న మూడేళ్లలో ఈ పెట్టుబడులను రిలయన్స్ పెడుతుందని ప్రకటించారు. ముఖేష్ అంబానీ కోల్‌కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ప్రారంభ వేడుకలకు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంబానీకి స్వాగతం పలికారు.
గొప్ప సంస్కృతి, విద్య, వారసత్వాల నెలవు బెంగాల్. ఐకమత్యమే బలం. ఇక్కడ అందరం కలిసే ఉంటాం.. అదే బెంగాల్‌కున్న మరో ప్లస్ పాయింట్. తమకు విభజించి పాలించు విధానం లేదంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్- 2023 7వ ఎడిషన్‌ను సీఎం మమత ప్రారంభించారు.
#WATCH | At the Bengal Global Business Summit event, Reliance Industries chairman Mukesh Ambani says, "Reliance will leave no stone unturned to accelerate West Bengal's growth. Reliance has invested close to Rs 45,000 crores in West Bengal. We plan to invest an additional Rs… pic.twitter.com/fmNWCVfekF
— ANI (@ANI) November 21, 2023
Comments
Please login to add a commentAdd a comment