పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్( ఫైల్ ఫొటో)
కోల్‌కతా: బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బేనర్జీ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘బెంగాల్‌లో హింసాత్మకమైన పాలన సాగుతోంది. భయంకరమైన హింసాత్మక ఘటనలు, సజీవ దహనాలు చూస్తుంటే అదే సత్యమనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఓ నివేదికను అడిగాను. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నా’ అని గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ట్విటర్‌లో విడుదుల చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని బొగ్తుయ్ గ్రామంలో సోమవారం బర్షల్ గ్రామ పంచాయితీ డిప్యూటీ చీఫ్ తృణమాల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత బాదు షేక్ బాంబు దాడిలో మరణించారు. అదేరోజు అర్ధరాత్రి చెలరేగిన హింసలో అల్లరి మూకలు 10 ఇళ్లకు నిప్పంటించారు. ఈ హింసాత్మక ఘటనలో 8 మంది మృతి సజీవ దహనమయ్యారు. టీఎంసీ నేత హత్యకు ప్రతీకారంగానే ఈ ఘాతుకానికి పాల్పపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Horrifying violence and arson orgy #Rampurhat #Birbhum indicates state is in grip of violence culture and lawlessness. Already eight lives lost.
— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) March 22, 2022
Have sought urgent update on the incident from Chief Secretary.
My thoughts are with the families of the bereaved. pic.twitter.com/vtI6tRJcBX
Comments
Please login to add a commentAdd a comment