కోల్‌కతా: బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ గురువారం పండంటి మగబిడ్డకు జన‍్మనిచ్చారు. ప్రసవం కోసం బుధవారం రాత్రి కోల్‌కతా పార్క్ స్ట్రీట్‌లోని భగీరథి నియోతియా ఆమె చేరారు. సిజేరియన్ ద్వారా కాన్పు అయిందనీ, తల్లీ బిడ్డ ఇద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉన్నారని బెంగాలీ నటుడు, నుస్రత్ స్నేహితుడు యష్ దాస్‌గుప్తా ప్రకటించారు. దీంతో నుస్రత్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. అభిమానులు, రాజకీయ మిత్రులు ఆమెకు అభినందనలు అందజేస్తున్నారు.
Congratulations @nusratchirps wish could hug in personal.
— Mimssi (@mimichakraborty) August 26, 2021
Love and hugs
జూన్‌లో తన బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను, స్నేహితుల శుభాకాంక్షలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన నుస్రత్ గురువారం ఉదయం కూడా హాస్పిటల్ నుంచి తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బాయ్ ఫ్రెండ్‌గా భావిస్తున్న దాస్‌గుప్తానే స్వయంగా దగ్గరుండి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు తమ మధ్య విభేదాలు ఉండవచ్చు కానీ అంటూ తల్లీ బిడ్డలిద్దరికీ శుభాకాంక్షలు తెలిపిన మాజీ భర్త నిఖిల్ బాబుకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. నిఖిల్ జైన్‌తో రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న నుస్రత్ 2019, జులై 19న టర్కీలో పెళ్లి చేసుకున్నారు. అయితే విభేదాల కారణంగా గతేడాది నవంబర్ నుంచి నుస్రత్, నిఖిల్ విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment