![Nusrat Jahan and Mimi Chakraborty Dance for Durga Puja Theme Song - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/19/mimi-nusrat-durga-puja-song.jpg.webp?itok=EIzySEzC)
కోల్‌కతా: సంచలనాలకు, వివాదాలకు మారు పేరుగా నిలిచారు తృణమూల్ కాంగ్రెస్ యువ ఎంపీలు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి. సినిమా రంగం నుంచి అది కూడా అతి చిన్న వయసులోనే పార్లమెంటుకు ఎన్నికయ్యి రికార్డు సృష్టించిన వీరు.. ప్రతి నిత్యం ఏదో ఓ వార్తతో మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. వీరిలో నుస్రత్ జహాన్ ముస్లిం అనే సంగతి తెలిసిందే. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆమె హిందూ సంప్రదాయ పద్దతిలో నుదుట సింధూరం, చీర ధరించి హాజరయ్యి విమర్శల పాలయ్యారు. అయితే తనను విమర్శించే వారిని పెద్దగా పట్టించుకోరు నుస్రత్. ఈ క్రమంలో తాజాగా ఈ యువ ఎంపీలు మరోసారి వార్తాల్లో నిలిచారు. పశ్చిమ బెంగాల్‌లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బెంగాల్ ప్రజలు దుర్గా పూజ కోసం సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో దుర్గా పూజ ఉత్సవాల ప్రధాన్యతను తెలిపే థీమ్ సాంగ్‌ను ఒకదాన్ని రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్‌లో టీఎంసీ ఎంపీలు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి నటిచడం విశేషం. టీఎంటీ బార్ కంపెనీ రిలీజ్ చేసిన ఈ సాంగ్‌లో ఇద్దరు ఎంపీలు దుర్గా మాతను పూజిస్తూ.. డాన్స్ చేశారు. వీరితో పాటు మరో ప్రసిద్ధ బెంగాలీ నటి శుభశ్రీ గంగూలి కూడా ఈ ఆడిపాడారు. ‘ఆషే మా దుర్గా షే’ టైటిల్‌తో ఉన్న ఈ పాటకు ఇంద్రదీప్ దాస్ గుప్తా సంగీతం అందించారు. బాబా యాదవ్ కొరియోగ్రాఫ్ చేసిన ఈ పాట ఇంటర్నెట్‌లో దుమ్ము రేపుతోంది. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఈ పాట ఇప్పటికే 1.5 మిలియన్ వ్యూస్ సంపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment