మీ బిడ్డ తండ్రి ఎవరో చెప్పండి?!.. నటి ఘాటు జవాబు | Actress Nusrat Jahan Firm Response On Father Of Her Baby | Sakshi
Sakshi News home page

Nusrat Jahan : మీ బిడ్డ తండ్రి ఎవరో చెప్పండి?!.. నటి ఘాటు జవాబు

Published Thu, Sep 9 2021 1:39 PM | Last Updated on Thu, Sep 9 2021 1:56 PM

Actress Nusrat Jahan Firm Response On Father Of Her Baby - Sakshi

సెలబ్రీటీల పర్సనల్‌ లైఫ్‌  గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరికి ఉంటుంది. కొందరైతే ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వారి కోపానికి కారణమవుతుంటారు. అలాంటి ప్రశ్నే బెంగాలీ నటి, తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ  నుస్రత్‌ జహాన్‌ ఎదురైంది. 

వివరాల్లోకి వెళితే.. నుస్ర‌త్ జ‌హాన్ ఈ మ‌ధ్యే ఓ మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. తల్లైన దాదాపు నెల తర్వాత మొదటిసారి ఆమె పబ్లిక్‌లోకి వచ్చింది. బుధవారం కోల్‌కతాలో ఓ సెలూన్‌ ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యింది. ఈ సందర్భంగా  బిడ్డ తండ్రెవరు అని ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకి సమాధానంగా బిడ్డ తండ్రి ఎవరో ఆ తండ్రికి తెలుసు అంటూ ఘాటు సమాధానం ఇచ్చింది.


(చదవండి: నా మొదటి ప్రేమ అలా..  ఎమోషనల్‌ అయిన షమితా శెట్టి

కాగా, జూన్‌ 19, 2019లో నుస్రత్‌, వ్యాపారవేత్త నిఖిల్‌ జైన్‌ టర్కీలోని ప్రైవేటు వెడ్డింగ్‌ సెరెమనీలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నవంబర్‌ 2020 నుంచి విభేదాల కారణంగా వారిద్దరూ విడిగా ఉంటున్నారు. అనంతరం 2021లో భారతీయ చట్టాల ప్రకారం జైన్‌తో తన వివాహం చెల్లదని నటి వెల్లడించింది. ఆ సమయంలో  ఆ బ్యూటీ బెంగాలీ నటుడు యశ్వంత్‌ దాస్‌గుప్తా రిలేషన్‌షిప్‌లో ఉందని రూమర్స్‌ వినిపించాయి. ఈ తరుణంలో గతనెల ఆమె ఓ మగబిడ్డకి జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement