Nusrat Jahan Newborn Son Father Name Yash Dasgupta - Sakshi
Sakshi News home page

Nusrat Jahan: తన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పిన నటి

Published Thu, Sep 16 2021 11:25 AM | Last Updated on Thu, Sep 16 2021 12:37 PM

Nusrat Jahan Newborn Son Father Name Yash Dasgupta - Sakshi

ఎట్టకేలకు తన బిడ్డ విషయంలో బెంగాలి నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ స్పందించారు. ఆమె ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో ఆ బిడ్డకు తండ్రి ఎవరు? అనే వార్తలు గుప్పుమన్నాయి. దానికి కారణం ఆమె భర్త నిఖిల్‌ జైన్‌తో విడిగా ఉండటమే. నిఖిల్‌ ఇంటి నుంచి బయటకు వచ్చాక తాను గర్భవతినని ఆమె వెల్లడించారు. ఈ క్రమంలో..  ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరనే అంశంపై విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. ఇక బిడ్డ పుట్టాక సైతం నుస్రత్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. అయినా ఆమె నోరు విప్పలేదు.

కానీ తాజాగా తన కుమారుడి జనన ధృవీకరణ పత్రంలో తన భాగస్వామి పేరుగా నటుడు యష్‌ దాస్‌ గుప్తా పేరును చేర్చడంతో విమర్శలకు తెరపడినట్లైంది. కాగా గతేడాది లాక్‌డౌన్‌ టైమ్‌లో `ఎస్‌ఓఎస్‌ కోల్‌కతా` సినిమా షూటింగ్‌ టైమ్‌లో నుస్రత్‌, యష్‌ దాస్ గుప్తా ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వీరిద్దరు డేటింగ్‌ చేస్తున్నారు. అయితే యష్‌ దాస్‌ గుప్తాకు ఆల్రెడీ పెళ్లి అయింది. ముంబైకి చెందిన ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్న శ్వేత సింగ్‌ను యష్‌ పెళ్లి చేసుకున్నాడని, వీరికి పదేళ్ల బాలుడు కూడా ఉన్నాడని సమాచారం.

కాగా, జూన్‌ 19, 2019లో నుస్రత్‌, వ్యాపారవేత్త నిఖిల్‌ జైన్‌ టర్కీలో అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నవంబర్‌ 2020 నుంచి విభేదాల కారణంగా వారిద్దరూ విడిగా ఉంటున్నారు. అనంతరం 2021లో భారతీయ చట్టాల ప్రకారం జైన్‌తో తన వివాహం చెల్లదని నటి వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement