మూడోసారి తండ్రయిన స్టార్ హీరో శివకార్తికేయన్ | Siva Karthikeyan Wife Blessed With Baby Boy | Sakshi
Sakshi News home page

Siva Karthikeyan: గుడ్ న్యూస్ చెప్పేశాడు.. ఈసారి కూడా మగబిడ్డే

Published Mon, Jun 3 2024 6:17 PM | Last Updated on Mon, Jun 3 2024 6:44 PM

Siva Karthikeyan Wife Blessed With Baby Boy

స్టార్ హీరో శివకార్తికేయన్ మూడోసారి తండ్రయ్యాడు. ఇతడి భార్య ఆర్తి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జూన్ 2నే బిడ్డ పుట్టినప్పటికీ ఒక రోజు లేటుగా శివకార్తికేయన్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: తమిళ యువ నిర్మాత అరెస్ట్.. ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి)

యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శివకార్తికేయన్.. '3' సినిమాతో సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగా మారి వరస హిట్స్ అందుకున్నాడు. రీసెంట్ టైంలో 'మహావీరుడు', 'అయలాన్' చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరించాడు.

ఇకపోతే 2010లో తన బంధువుల అమ్మాయి ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. 2013లో ఈ జంటకు ఆరాధాన అనే అమ్మాయి, 2021లో గుగున్ అనే అబ్బాయి పుట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీళ్లు తల్లిదండ్రులయ్యారు. ఈ క్రమంలోనే పలువురు శివకార్తికేయన్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement